Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

మద్యం ధరలకు నియంత్రణేది..?

Wine-Shop

ఆన్‌లైన్ విధానానికి స్వస్తి..
అధిక ధరలతో మందుబాబులకు చిల్లు..
షాపుల్లో కనిపించని ధరల పట్టిక..

పెబ్బేరు: మధ్యతరగతి ప్రజలకు సేదతీరేందుకు మద్యంతో వారికి అలసట తీరుట కొరకు సేవిస్తుంటారు. దానిని ఆసరాగా చేసుకొని మద్యం ధరలకు నియంత్రణ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల మద్యం ధరలను పెంచాలని నిర్ణయాలు తీసుకొంది. మద్యం ప్రియులకు మద్యం మరింత ప్రియం కానుంది. ఇటీవల మధ్యం షాపులకు టెండర్లు పూర్తికావడంతో ప్రస్తుతం మద్యం షాపులు బాటిల్స్‌పై అధిక ధరలను వసులు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇది అంతే అని నిర్లక్షంగా సమాధానమిస్తున్నారని మద్యం ప్రియులు వాపోతున్నారు. దేనైనా మానుకోగలరు కాని మద్యం మానుకోలేక మానసికంగా మద్యం ప్రియులు కుంగిపోతున్నారు.

ధరలపై ప్రశ్నిస్తే నిర్లక్షంగా సమాధానాలిస్తున్నారని, సిండికేట్‌గా మారి దంచుడే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వ్యాపార పారితోషకాలకే ధరల పట్టికలను ఏర్పాటు చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. మద్యం వ్యాపారులు సిండికేట్‌లుగా మారి ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి. పెబ్బేరులో 5 మద్యం షాపులుండగా చాలా గ్రామాలకు బెల్టు షాపులుండడం వల్ల మద్యంను విక్రయిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు షాపులపై కొరడా ఝులిపిస్తామని చెప్పి ఆచరణలో అమలు కాకపోవడం విడ్డూరం . ఇటీవల 5 మద్యం షాపులకు ఒక్కొక్క షాపుకు రూ. 40 లక్షల పైగా టెండర్లు దక్కించుకున్నారని, దీంతో అక్టోబర్ 1 నుండి కొత్త మద్యం షాపులు రెండేళ్లపాటు కొనసాగనున్నాయి.

ప్రభుత్వం ఆన్‌లైన్ విధానంలో తేడాలు…
ప్రభుత్వం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించినప్పటికీ మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి ఆన్‌లైన్ విధానం పాటించడం లేదు .ఆన్‌లైన్‌లో పొందుపర్చే ఆదేశాలను మద్యం వ్యాపారులు తుంగలో తొక్కుతున్నారు. మద్యం బాబులకు మద్యం సరఫరా చేయడం వారికి కంప్యూటర్ బిల్లులను ఇచ్చిన పాపాన పోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం బాబులకు విక్రయ బిల్లులు ఆన్‌లైన్‌లో నమోదు చేయమన్నట్లు గా సిండికేట్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. టెండర్లు భారీ స్థాయిలో వేసి మద్యం ప్రియులను ఆసరాగా చేస్తున్నారని వ్యాపారులు సమాయత్తమౌతున్నారు.

Comments

comments