Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

నడి రోడ్డుపై ప్రసవం…

Woman-gives-birth-on-Street

బిజీంగ్: నడి రోడ్డుపై మహిళ ప్రసవించిన ఓ వీడియో డ్రాగన్ కంట్రీ చైనా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  ఓ గర్భిణి షాపింగ్ కు వెళ్లి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెకు సహాయం చేశారు. అనంతరం వైద్యులకు కూడా సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకుని ఆమెకు చికిత్స అందించారు. పుట్టిన శిశుకు కూడా బాగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఆ మహిళ తనకు పుట్టిన బిడ్డతో పాటు సామాన్లు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో చైనా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన చైనాలోని గుయాంగ్డాంగ్ లో జరిగింది. ఇదిగో ఆ వైరల్ వీడియో….

Comments

comments