Search
Thursday 22 February 2018
  • :
  • :

ఊర కుక్కల దాడిలో 30గొర్రెల మృతి

death-sheep-image

మన తెలంగాణ/గుండాల : గుండాల మండల కేంద్రంలోని చౌడ్ల బావి వద్ద మాదరబోయిన రాంమల్లు వ్యవసాయ బావి వద్ద దొడ్డిలో ఉన్న గొర్రెల మందపై ఊర కుక్కలు దాడి చేసి, 30 గొర్రెల మృత్యువాత పడ్డాయి. గొర్రెల మంద యజమానికి దాదాపుగా రూ. 2 లక్షల వరకు నష్టం జరిగినట్లు గ్రామ విఆర్‌ఒ శ్రీనివాస చారి పంచనామ నిర్వహించి, పశువైధ్యుడిచే పోస్టుమార్టం నిర్వహించి, గ్రామ సమీపంలోని వాగులో పాతిపెట్టారు. ఆకస్మికంగా దాడి చేసిన ఊర కుక్కలను వెంటనే వెటర్నరి అధికారుల అనుమతులతో ఊర కుక్కలను అదుపులోకి తీసుకొవాలని, గ్రామ పంచాయితీ వారు మందు పెట్టి సాదు జంతువులను, మనషులను బయబ్రాంతులకు గురి చేస్తున్న ఊర కుక్కలను మందు పెట్టి చంపివేయాలని, అలాగే రాంమల్లును ప్రభుత్వం ఆదుకోవాలని, గొర్రెల, మేకల యజమానులు, గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

comments