Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

8792 టీచర్ కొలువులు

jobs

భర్తీకి నోటిఫికేషన్ జారీ
30 నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఫిబ్రవరి రెండో వారంలో పరీక్షలు
31 జిల్లాల ప్రాతిపదికన ఎంపిక

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష(టిఆర్‌టి) ద్వారా 8,792 టీచర్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) శనివారం ఐదు నోటిఫికేషన్లను విడుదల చేసింది.
1,941 ఎస్‌ఎ, 5,415 ఎస్‌జిటి పోస్టులు :
స్కూల్ అసిస్టెంట్ పోస్టులు(ఎస్‌ఎ) 1,941, సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జిటి) 5,415, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పిఇటి) 416 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) 9, భాషా పండితులు 1,011 పోస్టుల చొప్పున భర్తీ చేసేందుకు కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసింది.
ఫిబ్రవరి రెండవ వారంలో పరీక్ష: టీచర్ నోటిఫికేషన్లకు 2018 ఫిబ్రవరి రెండో వారంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి ప్రకటించింది. ఈ ఐదు నోటిఫికేషన్లకు ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఒక పోస్టు కంటే ఎక్కువ పోస్టులకు అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. రాష్ట్రంలో తొలిసారిగా 31 జిల్లాల ప్రాతిపదికన టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. టిఎస్‌పిఎస్‌సి నిర్వహించే పరీక్షకు 80 శాతం వెయిటేజి, టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజి ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. పిఇటి, స్కూల్ అసిస్టెంట్(ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టులకు టిఎస్‌పిఎస్‌సి నిర్వహించే రాత పరీక్షలోని ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుందని, ఈ పోస్టులకు టెట్ వెయిటేజి ఉండదని తెలియజేసింది.

Comments

comments