Search
Wednesday 20 June 2018
  • :
  • :

సమస్యలకు సత్వర పరిష్కారం

meeting

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చంపాలాల్

మన తెలంగాణ/ఆసిఫాబాద్ :  ప్రజా ఫిర్యాదుల్లో వచ్చిన సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ చంపాలాల్ అన్నారు.సోమవారం ప్రజా ఫిర్యాదుల్లో భాగంగా జిల్లాలోని పలు మండలాల నుండి వచ్చిన అర్జి దారులను నుండి ఫిర్యాదులను స్వీకరించారు.  కాగజ్‌నగర్ మండలానికి చెందిన మహ్మద్ యొక్క భూమి చేవేళ్ల ప్రాజెక్టు కాలువ నిర్మాణంలో ముంపునకు గురైందని తనకు నష్టపరిహారం  ఇప్పించాలని, రెబ్బెన మండలం నవేగాం గ్రామానికి చెందిన మోహన్ తన వారసత్వంగా వచ్చిన భూమిని కొందరు  అడ్డుపడుతున్నారని తనకు ఆ భూమి ఇప్పించాలని, కౌటాల మండలానికి చెందిన చంద్రశేఖర్ మీసేవా కేంద్రం అనుమతి కొరకు అనుమతి ఇవ్వాలని, ఆసిఫాబాద్‌కు చెందిన షబ్బీర్ హుస్సేన్ ఆసిఫాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాల నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లు , వంట గదులను రూర్‌బన్ పథకం నిధులను మంజూరు చేసి వాటిని పూర్తిచేయాలని ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగానికి 65కు పైగా దరఖాస్తులు వచ్చాయి.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్, సీపీఓ కృష్ణయ్య, డీఆర్‌డిఏ పీడి శంకర్‌తోపాటు వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.  

Comments

comments