Search
Tuesday 19 June 2018
  • :
  • :

ఆరుషి హత్య కేసు : వారు నిర్దోషులు

ARUSHI

అలహాబాద్ : ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులను నిర్దోషులుగా అలహాబాద్ హైకోర్టు గురువారం తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సమర్పించడంలో సిబిఐ విఫలమైందని కోర్టు పేర్కొంది. ఆరుషిని ఆమె తల్లిదండ్రులే చంపారనడానికి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. నోయిడాలో 2008 , మే 16న ఆరుషి తన పడకగదిలో హత్యకు గురైంది. ఆరుషి హత్యకు పనిమనిషి హేమ్‌రాజ్ (45)ను ప్రధాన నిందితుడిగా మొదట అనుమానించారు. అయితే ఆరుషి హత్య జరిగిన మరుసటి రోజే హేమ్‌రాజ్ తల్వార్ అపార్ట్‌మెంట్ టెర్రస్‌పై అనుమానాస్పదస్థితిలో చనిపోయి కనిపించాడు. హేమ్‌రాజ్, ఆరుషి సన్నిహితంగా ఉండడాన్ని చూసే ఆరుషి తల్లిదండ్రులు వీరిద్దరిని హత్య చేసినట్టు పోలీసులుఅనుమానించారు. వారిని అరెస్టు చేశారు. ఈ కేసు వివాదాస్పదం కావడంతో నాటి యుపి సిఎం మాయవతి సిబిఐ విచారణకు అప్పగించారు. అనంతరం పలు మలుపులు తిరిగిన ఈ కేసులో ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా నిర్ధారిస్తూ గురువారం అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది.

Aarushi murder case: They are Innocents

Comments

comments