Search
Wednesday 18 October 2017
  • :
  • :
Latest News

కలెక్టర్ పాత్రలో నయనతార

Nayantara

నయనతార ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వంలో శివ లింగ, విక్రమ్ వేధా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఆర్.రవీంద్రన్ నిర్మాతగా ట్రైడెంట్ ఆర్ట్ పతాకంపై తమిళంలో నిర్మిస్తున్న ‘ఆరమ్’ చిత్రాన్ని తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ  పొలిటికల్ డ్రామా చిత్రంలో నయనతార డిస్ట్రిక్ట్ కలెక్టర్‌గా కనిపించనుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ స్టార్ హీరోయిన్ కెరీర్‌లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలువనుందని అంటున్నారు ఫిల్మ్‌మేకర్స్. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చక్రం, డేంజర్, కృష్ణార్జున చిత్రాలకు పనిచేసిన ఓం ప్రకాష్ ఈ చిత్రానికి కెమెరామెన్. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం త్వరలో విడుదలకానుంది. నయనతార, విఘ్నేష్, సును లక్ష్మి, వినోదిని వైద్యనాథన్, రామచంద్రన్ దురైరాజ్, ఆనంద్‌కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్‌ః గోపికృష్ణ.

Comments

comments