Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

జియోకు పోటీగా ఎయిర్ టెల్ ఫోన్

 కార్బన్ మొబైల్స్‌తో భాగస్వామ్యం
 రూ.1399 ధరకే అందిస్తామని వెల్లడి

Airtel-phonesన్యూఢిల్లీ: జియో ఫోన్‌కు పోటీగా దేశీయ అతిపెద్ద టెలికామ్ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది. కార్బన్ మొబైల్స్ భాగస్వామ్యంతో ఈ 4జి ఫోన్‌ను విక్రయించనుంది. స్మార్ట్‌పోన్‌కు హద్దులను చెరిపేస్తూ కార్బన్ భాగస్వామ్య ంతో స్మార్ట్‌ఫోన్ తీసుకురావడం తమకెంతో ఆనందాన్ని కల్గిస్తోందని, లక్షలాది భారతీయులకు టచ్‌ఫోన్లతో అద్వితీయమైన అనుభూతిని పొందుతార ని భారతీ ఎయిర్‌టెల్ కన్జూమర్ బిజినెస్ డైరెక్టర్, సిఎంఒ రాజ్ పుదిపెడి అన్నారు. ఒప్పందంలో భా గంగా కార్బన్ ఎ40 ఇండియన్ ఇప్పుడు రూ. 1399 ధరకే లభ్యం కానుందని అన్నారు. ప్రస్తు తం ఈ ఫోన్ మార్కెట్ ధర సుమారు రూ. 3,499గా ఉంది. ‘మేరా పెహ్లా 4జి స్మార్ట్‌ఫోన్’ పేరి ట ఈ మొబైల్‌ను ఎయిర్‌టెల్ ప్రకటించింది. రూ. 1500కే 4జి ఫోన్‌ను జియో తీసుకొచ్చిన నేపథ్యం లో దానికి పోటీగా ఎయిర్‌టెల్ కూడా స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే కార్బన్ మొబైల్స్‌తో జట్టుకట్టి కార్బన్ ఎ40 మొబైల్‌ను తీసుకురానున్నామని కం పెనీ వెల్లడించింది. ఆఫ్‌లైన్‌లో స్టోర్లలో ఈ ఫోన్లను అందుబాటులో ఉంచనున్నట్టు వెల్లడించింది.
డౌన్‌పేమెంట్ వివరాలు..
ఎయిర్‌టెల్ దీన్ని రూ.2899 డౌన్ పేమెంట్‌తో వినియోగదారులకు విక్రయించనుంది. ఇందులో రూ.1500 మొత్తాన్ని మూడేళ్ల తర్వాత వాపసు ఇస్తారు. అంటే ఫోన్ ధర రూ.1399కే వినియోగదారులకు దక్కనుంది. క్యాష్‌బ్యాక్ పొందేందుకు వినియోగదారులు తొలి 18 నెలల్లో కనీసం రూ.3వేలు రీఛార్జి చేయాల్సి ఉంటుంది. అప్పుడు తొలి విడతగా రూ.500 క్యాష్‌బ్యాక్ అందిస్తారు. ఆ తర్వాతి 18 నెలలకూ అంతేమొత్తంలో రీఛార్జి చేయడం ద్వారా మిగిలిన రూ.1000ని పొందుతారు. మూడేళ్ల తర్వాత ఫోన్ వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని ఎయిర్‌టెల్ పేర్కొంది. నెలకు రూ.169 రీఛార్జిపై అపరిమిత కాల్స్‌తో పాటు రోజుకు 500 ఎంబి డేటాను ఈ ప్యాక్ ద్వారా

Comments

comments