Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

ఉ.కొరియాపై అమెరికా విమానాల చక్కర్లు

                         B1B-Lancer

సియోల్ : ఉ.కొరియా ద్వీపకల్పంపై అమెరికాకు చెందిన రెండు అత్యంత అధునాతన యుద్ధ విమానాలు బుధ వారం విన్యాసాలకు దిగాయి. శబ్దవేగాన్ని మించి పయనించగలిగే ఈ సూపర్‌సోనిక్ హెవీ బాంబరు విమానాలు గగనతలంపై రివ్వున దూసుకువెళ్లాయి. అమెరికా ఆధీనంలోని గువామ్ ద్వీపంపై అణుదాడికి దిగుతామని ఇటీవలే ఉ.కొరియా హెచ్చరించింది. దీనికి ప్రతిగా అమెరికా తన శక్తిని ప్రదర్శించింది. రెండు బి1 బి లాన్సర్‌లు గువామ్ నుంచి బయలుదేరి జపాన్, దక్షిణ కొరియాతో కలిసి సంయుక్త విన్యాసాలలో పాల్గొన్నాయని యుఎస్ పసి ఫిక్ ఎయిర్ ఫోర్స్ వర్గాలు తెలిపాయి. ప్యోంగాంగ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు అమెరికా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Comments

comments