Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సుపై దాడి!

Bus

గువాహటి: భారత్‌తో మంగళవారం జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్ అనంతరం హోటల్‌కు బయలుదేరుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సుపై కొందరు అభిమానులు రాళ్లు రువ్వారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దాడికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఆస్ట్రేలియా క్రికెటర్ అరోన్ ఫించ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రెండో టి20 మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలుకావడంతో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. మ్యాచ్ అనంతరం తమ కోపాన్ని విజేత జట్టు బస్సుపై ప్రదర్శించారు. కాగా బస్సుపై రాళ్లు రువ్వుతున్న అభిమానులను పోలీసులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా కొందరిని అదుపులోకి కూడా తీసుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. గువాహటి శివారులోని బ ర్సపారాలో నూతనంగా నిర్మించిన స్టేడియంలో భారత్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్‌ను నిర్వహించారు. ఇందులో భార త్ ఘోర పరాజయం పాలైంది. దీంతో అభిమానులు ఆగ్రహానికి గు రయ్యారు. అంతేగాక తమ జట్టును ఓడించారనే కోపంతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు రువ్వి నిరసన తెలిపారు. కాగా, ఈ సంఘటనపై పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేశా రు. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సొనొవాల్ ఆస్ట్రేలియా క్రికెటర్లకు క్షమాపణ చెప్పారు. అంతేగాక సంఘటనకు పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. మరోవై పు కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింఘ్ రాథోడ్ కూడా ఆస్ట్రేలి యా క్రికెటర్లపై దాడిని తీవ్రంగా ఖండించారు. దీనికి పాల్పడిన వా రిని కఠినంగా శిక్షించాలని కోరారు. అంతేగాక భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరుగకుండా చూడాలని సూచించారు. ఇదిలావుండగా మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన అస్సాం క్రికెట్ సంఘం తీసుకు న్న భద్రత చర్యలపై పలువురు మాజీ క్రికెటర్లు నిరసన వ్యక్తం చేశా రు. ఇటువంటి చర్యలతో భారత ప్రతిష్ఠ దెబ్బతింటుందని వారన్నా రు. పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడంలో క్రికెట్ సంఘం, పోలీసులు విఫలమయ్యారని వారు సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేశారు. కాగా దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని గువాహటి పోలీస్ కమిషనర్ తెలిపారు.

Comments

comments