Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే : భట్టి విక్రమార్క

PCC Working President Mallu Bhatti Vikramarka Comments on TRS Party in Telangana

ఖమ్మం : వచ్చే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్‌లోకి రేవంత్‌రెడ్డి రాకను స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. భవిష్యత్‌లో కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయని ఆయన తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటనపై తమ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అలంభిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై కెసిఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. కెసిఆర్ ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజల్లో చైతన్యం తేవాలని ఆయన కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

Bhatti Vikramarka Comments on KCR Govt

Comments

comments