Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

గొర్రెల మార్పిడి చేస్తే కేసులు

mikeజిల్లాలో 5వేల యూనిట్ల పంపిణీ
10శాతం యూనిట్లను
క్రాస్ వెరిఫికేషన్ చేసి నివేదిక ఇవ్వాలి
జిపిలలో 100శాతం
పన్నులు వసూలు
వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్

మనతెలంగాణ/వరంగల్‌బ్యూరో: రాష్ట్ర ప్రభు త్వం కులవృత్తులను ప్రొత్సహించేందు కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటానని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హెచ్చరించారు. గొర్రెల రిసైక్లింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది, అలాంటిది జరిగితే కేసులు నమోదు చేస్తామని పశుసంవర్థకశాఖ అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. సోమవారం గ్రీవెన్స్ అనంతరం వివిధశాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ రూర ల్ జిల్లాలో ఇప్పటివరకు 5వేల గొర్రెల యూనిట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంపిణీచేసిన మొత్తం గొర్రెల యూనిట్ల లో పదిశాతం గొర్రెల యూనిట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలని సంబంధిత పశుసంవర్థకశాఖ అధికారుల ను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను నిర్ధేశిత నమూనాలో వివరాలను పొందుపర్చి వచ్చే సోమవారంలోగా అందజేయాలని మండల ప్రత్యేకాధికారుల ను కలెక్టర్ ఆదేశించారు. మండలాలవారీగా లబ్ధిదారుల వివరాలను  ఆయా మండల ప్రత్యేక అధికారులకు అందజేస్తామన్నారు.
100శాతం పన్నుల వసూలు చేయాలి
జిల్లాలో పన్నుల వసూల్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 100శాతం పన్నులు సేకరించాలన్నారు. ఇందుకోసం ఇప్ప టినుంచే నిర్ధిష్టమైన ప్రణాళికలతో ముందుకు పోవాలని సూచించారు.
-గ్రీవెన్స్‌కు అన్ని శాఖల అధికారులు
హాజరుకావాలి
వారం వారం జరిగే గ్రీవెన్స్‌కు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలన్నారు. వరంగల్ రూరల్ డివిజన్ రెవెన్యూ అధికారి మహేందర్, కలెక్టరేట్ ఎఒ రమేష్, వ్యవసాయశాఖ జెడి ఉషాదయాళ్, పశుసంవర్థకశాఖ జెడి వెంకయ్యనాయుడు, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments