Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

డిసిసిబి పాలకవర్గంపై …సిబిసిఐడి విచారణ

MAHA

నిధులు దుర్వినియోగంపై
క్రిమినల్ కేసులు పెట్టాలి
పోలీసుల బందోబస్తు నడుమ
మహాజన సభలో ఆమోదం
రబీ నిధులపై ఎలాంటి చర్చలేదు
సహకార సంఘాల అధ్యక్షుల ఆగ్రహం
ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు
డిసిసిబి మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి

మనతెలంగాణ/వరంగల్‌బ్యూరో: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డిసిసిబి)లో జరిగిన నిధుల దుర్వినియోగంపై సిబిసిఐడి విచారణ చేపట్టాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిసిసిబి మహాజన సభ ఏకగ్రీవం గా ఆమోదించింది. శుక్రవారం వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్, డిసిసిబి ప్రత్యేక పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన డిసిసిబి మహాజన సభ జరిగింది. ఈ సభకు వివి ధ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల అధ్యక్షులు, గొర్రెలు, మేకలు, చేపలు, చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, డిసిసిబి డైరెక్టర్లు హాజరయ్యారు. సమావేశాన్ని వ్యూ హాత్మకంగా నిర్వహించారు. మహాజనసభకు వచ్చిన సొసైటీల అధ్యక్షులతో ముందుగానే సంతకాలు తీసుకున్నారు. అనంతరం మహాజనసభ నివేదికను సభలో చదివి వినిపించారు. 51జీవో పేర్కొన్న ప్రకారం డిసిసిబిలో సుమారుగా రూ.7.99కోట్ల అక్రమాలు జరిగాయని రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రావు ఇచ్చిన రిపోర్టుతోపాటు ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేయడంతోపాటు సిబిసిఐడిచే విచారణ జరిపించాలని సిఫారస్సుచేశారు. ఇదే అంశాన్ని మహాజనసభలో చదివి వినిపించి సిబిసిఐడి విచారణతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లుగా సిఇఓ అంజయ్య ప్రకటించారు. వెంటనే కలెక్టర్, పాలనాధికారి లేచి వెళ్లిపోయారు.
అవాక్కైన సొసైటీ అధ్యక్షులు
డిసిసిబి మహాజన సభను కేవలం 51జీవో ఆమోదం కోస మే ఏర్పాటు చేసినట్లుగా సొసైటీల అధ్యక్షులు భావించారు. పథకం ప్రకారం అధ్యక్షులతో ముందుగా సమావేశానికి వచ్చినట్లుగా సంతకాలు చేయమన్నారు. నివేదిక చదివి వినిపించిన తరువాత నివేదికను సభ ఆమోదించిందని సిఇఒ అంజయ్య ప్రకటించడంతో సొసైటీల అధ్యక్షులు, డిసిసిబి మాజీ డైరెక్టర్లు అవాక్కయ్యారు. మహాజనసభను ఎందుకు నిర్వహించారు? అసలు ఎందుకు పిలిపించినట్లని సిఈఓ అంజయ్యను అధ్యక్షులు నిలదీశారు. సెప్టెంబర్ నుంచి రబీ సీజన్ ప్రారంభమవుతుండడంతో
బ్యాంకు మహాజన సభలో రబీకి సంబంధించిన రు ణ ప్రణాళికను అమోదిస్తారని వస్తే వాటి ఊసే ఎత్తకుండా మమ్ములను తప్పుదోవ పట్టించారంటూ సొసైటీ అధ్యక్షులు సిఈఒను నిలదీశారు. అప్పటికే జిల్లా కలెక్టర్ బ్యాంకు నుంచి వెళ్లిపోయారు. సోసైటి అధ్యక్షులు నిలదీస్తుండడంతో పోలీసులు వచ్చి వారిని బయటకు పంపించారు.
– తూతూ మంత్రంగానే మహాజనసభ
మహాజన సభలో బ్యాంకుకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కాని శుక్రవారం నిర్వహించిన బ్యాంకు మహాజన సభలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కనీసం రబీకి సంబంధించి న రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు, విద్య రుణాలు, వాహనరుణాలు, మర్టిగేజ్ రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఏ ఒక్క అంశంపై చర్చించకుండానే సమావేశాన్ని ముగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇది కేవలం 51జీఓలో పేర్కొనబడిన రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రావు సిఫారస్సు చేసిన అంశాల పై ఏకగ్రీవంగా ఆమోదింప చేయడం కోసమే సమావేశాన్ని నిర్వహించారని సొసైటీల అధ్యక్షులు అభిప్రాయపడ్డారు. తూతూ మంత్రంగానే నిర్వహించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రైతుల రుణాలు, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపైన కూడా ఎలాంటి చర్చ జరుగలేదని వారు వాపోయారు.
-నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు
జంగా రాఘవరెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్
నష్టాలలో ఉన్న బ్యాంకును లాభాలలోకి తీసుకొచ్చా ను. బ్యాంకులో నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని డిసిసిబి మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. మహాజన సభలో నివేదిక చదివి అనంత రం రాఘవరెడ్డి ఒక్కరికి మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ వరసుగా నాలుగు సంవత్సరాలపాటు బ్యాం కులో ఆడిట్ జరిగింది. నాబార్డు అధికారులు, ఆప్కా బ్, టిఎస్‌కాబ్ అధికారులు వచ్చి బ్యాంకులో అడిట్ నిర్వహించారు. నాలుగు సంవత్సరాలపాటు బ్యాం కు నిర్వహణ చాలా బాగా ఉందని, మంచిగా లాభాలలో నడుస్తుందని కితాబు ఇచ్చారని గుర్తు చేశారు. బ్యాంకుల డబ్బులు బ్యాంకులోనే ఉన్నప్పుడు అక్రమాలు జరిగినట్లు ఎలావుతుందని ఆయన ప్రశ్నించారు. నేను పాలకుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు అక్కడి వెళ్లి ప్రచారం చేసుకుంటుండడంతో అక్కడ ఉన్న ఎంఎల్‌ఎ ఎర్రబెల్లి దయాకర్‌రావు తనను రాజకీయంగా ఎదుర్కొలేకి బ్యాం కును, రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్రలో భాగంగానే నాపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని రాఘవరెడ్డి అన్నారు. అసలు 51జీవోలో పూర్తిగా తప్పుల తడకగా ఉందని ఆయన పేర్కొన్నారు.
భారీ బందోబస్తు నడుమ మహాజన సభ
డిసిసిబి మహాజన సభను భారీ పోలీసు బందోబస్తు నడుమ నిర్వహించారు. డిసిసిబి పాలక వర్గాన్ని రద్దు చేసిన తరువాత మొదటి సారిగా మహాజనసభను కలెక్టర్ అధ్యక్షతను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏమైన అవాంఛనీయ సంఘటనలు జరుగవచ్చని ముందస్తుగానే భారీగా పోలీసులను మోహరింప చేశారు. డిసిసిబి మహాజనసభను పోలీసు బం దోబస్తు నడుమ నిర్వహించడాన్ని సహకార సం ఘాల అధ్యక్షులు, డిసిసిబి మాజీ పాలకవర్గ సభ్యు లు పూర్తిగా తప్పుబట్టారు. ఈ సమావేశంలో డిసిసిబి మాజీ డైరెక్టర్లతోపాటు డిసిసిబి సిఇఒ బి. అంజ య్య, జిఎం శ్రీనివాస్, డిసివో కరుణకర్, నాబార్డు అధికారి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments