Search
Tuesday 19 June 2018
  • :
  • :

నానోతో నష్టం తక్కువే..

Chandrashekaran

ఆ ప్రాజెక్టుపై విమర్శలకు ఎలాంటి కారణాల్లేవు
టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

న్యూఢిల్లీ: నానోపై విమర్శలు చేసేందుకు ఎలాంటి కారణాలు లేవని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. మూసివేత లేదా చిన్న కారు లైఫ్‌ను ఇస్తుందా? లేదా? అనేది టాటా మోటార్స్ ముందు బిలియన్ డాలర్ల ప్రశ్నేమీ కాదని అన్నారు. ఓ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. నానాతో నష్టాలొచ్చాయి.. అయితే వార్షికంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్లలో ఆ నష్టం 4 శాతమేనని అన్నారు. ‘చాలా మంది నానోను టార్గెట్ చేస్తున్నారు. దీనికి ఎలాంటి కారణాలు లేవు. ప్యాసింజర్ వాహనాల్లో ఒక్క మోడల్ ఇండికా మాత్రమే లాభాలు తెచ్చిపెట్టింది. మిగతా మోడళ్లతో అంతా నష్టాలే వచ్చాయి’ అని చంద్రశేఖరన్ అన్నారు. గత ఏడాదిలో టాటా సన్స్ సిఇఒగా ఉన్న సైరస్ మిస్త్రీని అర్థాంతరంగా తొలగించారు. తనను ఆకస్మికంగా తొలగించడంలో మిస్త్రీ నానోపై ఆరోపణలు చేశారు.. దీని వల్ల నష్టం రూ.1000 కోట్లకు చేరిందని అన్నారు. భావోద్వేగ కారణాల వల్ల నానా ప్రాజెక్టును టాటా మోటార్స్ మూసివేయలేకపోతోందని మిస్త్రీ విమర్శించారు. ఇదే విషయమైన చంద్రశేఖరన్ ప్రశ్నించగా రతన్ టాటా కలల ప్రాజెక్టు నానో నష్టాలను తక్కువ చేసి చూపించారు. ఏడాదికి 4 శాతమే నానో ప్రాజెక్టుతో నష్టం వచ్చిందని ఇంటర్వూలో తెలిపారు.

air india

ఎయిర్ ఇండియా కొనుగోలుపై దృష్టి
ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్‌పై టాటా గ్రూప్ దృష్టి పెట్టిందని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ అన్నారు. ప్రభుత్వం విమానయాన సంస్థను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. దీని ద్వారా తొలిసారిగా టాటా గ్రూప్.. ఎయిర్ ఇండియా కొనుగోలుపై అధికారిక ప్రకటన చేసినట్టైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా విక్రయించాలని ప్రభుత్వం ప్రతిపాదనల్లో ఉంది. అయితే ఈ సంస్థను మళ్లీ టాటాలే దక్కించుకోనున్నారనే ఊహాగానాలను చంద్రశేఖరన్ నిజం చేశారు. టాటా గ్రూపునకు చెందిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ విస్తారా కేవలం డజను విమానాలతోనే ఆగిపోవడానికి ఇష్టపడడం లేదు. ఈ రంగంలో మరింతగా విస్తరించాలని కంపెనీ భావిస్తున్నట్టు ఆయన తెలియజే శారు. ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమంలో భాగంగా ఎయిర్ ఇండియాలో వాటాలను కేంద్రం విక్రయించేందుకు సిద్ధమైంది. అయితే ఈ సంస్థలో ఏ విధంగా డిజిన్వెస్ట్‌మెంట్ ఉండనుందనే ఈ వివరాల కోసం ఎదురుస్తున్నామని ఎన్.చంద్రశేఖరన్ అన్నారు. 2000 సంవత్సరంలో టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లు సంయుక్తంగా ఎయిర్ ఇండియాలోని 40 శాతం వాటాను కొనుగోలుచేసేందుకు తమ ఆసక్తిని ప్రకటించాయి. ఒకవేళ ప్రభుత్వం ఎయిర్ ఇండియాను ప్రైవేటు పరం చేసే నిర్ణయం తీసుకుంటే మాత్రం టాటా గ్రూప్ ఈ సంస్థను కొనుగోలుచేసేందుకు సిద్ధమని 2013లో రతన్‌టాటానే స్వయంగా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ విషయంపై ప్రభుత్వం నుంచి సమాధానం లేకపోవడంతో టాటాలు కూడా తమ ప్రయత్నాలను వాయిదావేసుకున్నారు. 1932లో జెఆర్‌డి టాటా ఎయిర్ ఇండియాను టాటా ఎయిర్‌లైన్స్ పేరుతో ప్రారంభించారు. ఈ సంస్థను 1953లో కేంద్ర ప్రభుత్వం టాటాల నుంచి తీసుకొని నడుపుతోంది.

Comments

comments