Search
Monday 11 December 2017
  • :
  • :

తల్లిపాలు విషమై… చిన్నారి మృతి

పురుగుల మందు తాగిన తల్లి పాలతో చిన్నారి మృతి
రూ.3 లక్షల అప్పుల బాధతో రైతు కుటుంబం ఆత్మహత్యయత్నం
భర్త మృతి,భార్య పరిస్థితి విషమం

Suicide

మన తెలంగాణ/కడెం: అభం శుభం తెలియని చిన్నారి మహేశ్వరి (11నెలలు) ఆకలి తట్టుకోలేక తల్లి పాలు తాగి చనిపోయిన ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో చోటుచేసుకుంది. అప్పుల బాధతో చిన్నారి తల్లితండ్రులు పురుగుల మందు తాగారు. తల్లిని ఆస్పత్రికి తరలిస్తున్నప్పుడు ఆకలి బాధ తట్టుకోలేక చిన్నారి తల్లిపాలు తాగింది. దీంతో ఆ పాలు విషపూరితం కావడంతో ఆ చిన్నారి మృత్యువాత పడింది. ఈ ఘటనలో రైతు కటుంబంలో భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. ధర్మాజీపేట్‌కు చెందిన కసునూరి భీమేష్(36) తండ్రి పదేళ్ళ క్రితమే మరణించాడు. అతడికి నలుగురు అక్కచెల్లెలు ఎకరం సాగు భూమి ఉండగా సాగు చేస్తూ కుంటుంబాన్ని పోషిస్తున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉండగా ఒక కుమారుడు కాలువలో పడి చనిపోయాడు. భార్యకు విడాకులు ఇచ్చిన భీమేష్ రెండేళ్ళ క్రితమే శైలజ(31)ను పెండ్లి చేసుకున్నాడు వీరికి కుతురు మహేశ్వరి ఉంది. కుటుంబ అవసరాల కోసం రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పు తీరకపోగా వడ్డీ పెరగడంతో మనస్థాపానికి గురైన భార్యభర్తలు శుక్రవారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగారు. స్థానికులు నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ భీమేష్ మృతి చెందాడు. అలాగే ఆసుపత్రిలో ఉన్న శైలజ పరిస్థితి విషమంగా ఉంది. ఇవేవి తెలియని చిన్నారి మహేశ్వరి తల్లిపాలను తాగింది. తల్లి పాలు విషపూరితమవ్వడంతో చిన్నారి సృహ కోల్పోయింది. చిన్నారిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. ఈ విషయం తెలిసిన బంధువులు, స్థానికులు కంటతడి పెట్టారు.

Comments

comments