Search
Wednesday 18 October 2017
  • :
  • :
Latest News

చిన్నారిపై బాబాయి అత్యాచారం – హత్య

Rape

సంగారెడ్డి : ఓ చిన్నారిని ఆమె సొంత బాబాయి కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. అనంతరం ఆ చిన్నారి గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన మొగడంపల్లి మండలం మన్నాపూర్‌లో జరిగింది. మన్నాపూర్‌కు చెందిన ఆంజనేయులు, స్వప్న దంపతుల కూతురు సాయి ప్రియాంక (6)పై సొంత బాబాయి శివకుమార్ (19) ఈ దారుణానికి ఒడిగట్టాడు. సాయి ప్రియాంక బుధవార పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయి ప్రియాంకను ఆమె బాబాయి శివకుమార్‌తో కలిసి చూసినట్టు పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. సాయి ప్రియాంకపై తాను రెండు సార్లు అత్యాచారానికి పాల్పడి గొంతు నులిమి చంపి శివారులోని వ్యవసాయ బావిలో పడేసినట్టు శివకుమార్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. గ్రామస్థుల సహకారంతో సాయి ప్రియాంక మృతదేహాన్ని బావి నుంచి వెలికి తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Child Rape and Murder

Comments

comments