Search
Tuesday 19 June 2018
  • :
  • :

కాంగీ నేతల వల్లే సాగర్ నిర్మాణ స్థలం మారింది

K Chandra shaker Rao Green Signal to KCR Kits For Pregnant Wowen

సూర్యాపేట : కాంగ్రెస్ నేతలు చేసిన మోసం వల్లే నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ స్థలం మారిందని తెలంగాణ సిఎం కెసిఆర్ ధ్వజమెత్తారు. నాగార్జునసాగర్ అసలు పేరు నందికొండ ప్రాజెక్టు అని ఆయన పేర్కొన్నారు. గురువారం రాత్రి సూర్యాపేటలో జరిగిన ప్రగతి సభలో ఆయన మాట్లాడారు. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు వద్ద 65 వేల క్యూసెక్కుల కాలువ తవ్వితే కాంగ్రెస్ నేతలు కనీసం నోరు మెదపలేదని ఆయన ఘాటుగా విమర్శించారు. లక్ష మంది ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టితీరుతామని ఆయన స్పష్టం చేశారు. యాదాద్రి వద్ద ఆల్ట్రా పవర్ మెగాప్లాంట్‌ను నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అడ్డుకోవడమే పనిగా ప్రతిపక్షాలు పెట్టుకున్నాయని ఆయన ఆరోపించారు.

CM KCR Comments on Congress Leaders

Comments

comments