Search
Wednesday 20 June 2018
  • :
  • :

బుద్ధి చెప్పండి

మూడు, నాలుగు నెలల్లో ఇంటింటికి భగీరథ నీరు
పత్తి బాగా పండించారు ఆశించిన ధర రాకపోవచ్చు
రూ.44వేల కోట్ల సంక్షేమ పథకాలతో దేశంలోనే ముందున్నాం
చేనేత కార్మికులకు అపూర్వస్థాయిలో మేలు
గత పాలకులు 7ఫీట్ల ఎత్తు, 3 ఫీట్ల లావు ఉండే వారు, ప్రజలకు మాత్రం ఏమీ చేయలేదు
సిరిసిల్లలో రూ.130 కోట్లతో రెండు ఎత్తిపోతలు చేపడతాం
అధికారంలో ఉన్నంత కాలం ఎకరానికి రూ.8 వేలిస్తాం

KCR

సిరిసిల్ల:చిల్లర రాజకీయాలు చేసే రాజకీయ పార్టీలకు, సంక్షేమ పథకాలపై అపార్థాలు, పెడర్థాలు తీసే వారికి ప్రజలే తగిన బుద్దిచెప్పాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 100 ఎకరాల్లో కలెక్టరేట్, పోలీస్ కార్యాలయాల భవన సముదాయాలకు భూమి పూజచేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగాప్రజలు మౌనం గా ఉంటే వారికి న్యాయం జరగదని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు అడ్డుపడే వారందరిని సరైన సమయం లో బుద్ది చెప్పాలని ఆయన అన్నారు. మెట్ట ప్రాంత పంటలను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లు రాకుం డా అడ్డుకునే వారి ప్రయత్నాల కు ప్రజలు గట్టిగా బుద్ది చెప్పాలని ఎవరు అడ్డుకున్నా కాళ్లను గోదావరి నీళ్లతో కడిగి తీరుతానని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. ప్రపంచమంతా ఆశ్చర్యంగా చూస్తున్న మిషన్ భగీరథ పథకం ద్వారా 3,4 నెలల్లో ఇంటింటికి నీరందిస్తానన్నారు. రాష్ట్రంలో ఈ సారి రైతులు ఇష్టారాజ్యంగా 50 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేశారని దాని వల్ల ఆశించిన లాభం రాకపోవచ్చని అయితే అమెరికాలో తుఫాన్ రావడం వల్ల గిట్టుబాటు ధర లభించే అవకాశం లేకపోలేదన్నారు. సిరిసిల్ల వెనకబడ్డ ప్రాంతమని చేనేత కార్మికుల అభివృద్దికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో 44000 కోట్లతో సంక్షేమ పథకాలను చేపడుతూ దేశంలోనే అగ్రగామిగా ఉ న్నామన్నారు. పవర్ లూం కార్మికులసంక్షేమం కోసం రాష్ట్రంలో వెయ్యి కోట్లతో పథకాలు చేపడుతుండగా ఒక్క సిరిసిల్లకే 800 కోట్లు లాభం కలుగుతాయన్నారు. 30 కోట్లతో అపెరల్ పార్కు ను ఏర్పాటు చేసి 6000 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. 50 శాతం సబ్సిడీ తో కార్మికులకు నూలు, ముడిసరుకులు అందిస్తామన్నారు. కార్మికులకు నెలకు రూ. 20 వేల వరకు జీతం అందేలా చూస్తామన్నారు. రూ. 400 కోట్లతో పవర్‌లూంల ఆధునీకరణ చేపడుతామన్నారు. సిరిసిల్లకు ప్రభుత్వానికి అవసరమైన గుడ్డ కోసం రూ. 200 కోట్ల రూపాయల ఆర్డర్‌లు ఇచ్చామన్నారు. ఏడాది పొడవునా వస్త్రాల కొనుగోలుకు ఆర్డర్లు  ఇస్తామన్నారు. కార్మికులకు చేతినిండా పని కల్పిస్తామన్నారు. సిరిసిల్లలో రూ. 130 కోట్లతో రెండు ఎత్తిపోతల పథకాలు చేపడుతామన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయితీకి రూ. 20 లక్షలు, హామ్లెట్లకు, తండాలకు రూ. 5 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. ప్రతి మండల కేంద్రానికి రూ. 25 లక్షలను మంజూరు చేస్తున్నామన్నారు. సిరిసిల్ల, వేములవాడ పురపాలక సంఘాలకు ఎన్ని నిధులు అవసరమైతే అన్ని అందిస్తామన్నారు. తెరాస అధికారంలో ఉన్నంత కాలం రైతులకు ఎకరానికి 8 వేల రూపాయలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, ఈటెల రాజేందర్, ఎంపి వినోద్‌కుమార్, శాసనసభ్యులు రమేశ్‌బాబు, రసమయి బాలకిషన్, బొడిగె శోభ, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్‌రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాదరావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శేఖర్‌ప్రసాద్ సింగ్ పాల్గొన్నారు.

Comments

comments