Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

తెలంగాణలో కమీషన్ల దందా : చాడ విమర్శ

chada-venkatreddy

మన తెలంగాణ/ ఖమ్మం ప్రతినిధి  : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం దొందు దొందేనని అక్కడ మతోన్మాదానికి కేంద్ర ప్రభు త్వం ఊతంగా నిలుస్తుంటే రాష్ట్రంలో నిరంకుశత్వం కొనసాగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రజలను విస్మరించి పాలన సాగిస్తున్నారని మోదీ కార్పొరేట్ శక్తులకు ఊతంగా నిలుస్తున్నారని కెసిఆర్ చేపట్టే అభివృద్ధి పనులు కేవలం కమీషన్ల కోసమే జరుగుతున్నాయని తెలిపారు. సిపిఐ చేపట్టిన ప్రజా పోరు యాత్ర సభ ను పురస్కరించుకుని ఖమ్మం పెవిలియన్ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు అధ్యక్షతన జరిగిన సభ లో చాడ మాట్లాడుతూ మోదీ ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు ఇప్పటి చేతలకు ఏ మాత్రం పొంతన లేదన్నారు. నల్లధనాన్ని వెలికి తీసి పేదలకు పంచుతానన్న మోదీ ఆ పని ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కాపలా కుక్క గా ఉంటానన్న, దళిత ముఖ్యమంత్రిని చేస్తానని అన్నందునే  కేసీఆర్‌ను ప్రజలను నమ్మారని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి పాలన సాగిస్తున్నాడన్నారు.

కెసిఆర్ ప్రభుత్వమంటే పని తక్కువ ప్రచార మెక్కువ అన్న చందంగా తయారైందని ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతుంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్  ఇంకా  మాటల గారడీతో మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రజలను చైతన్యవంతం చేసి పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలు నిర్మించేందుకు పోరుబాట యాత్రను ప్రారంభించినట్లు చాడా తెలిపారు. ఈ సభలో సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఎం నాయకులు పోతినేని సుదర్శన్‌రావు, కాంగ్రెస్, టిడిపి, సిపిఎం నాయకులు అయితం సత్యం, తుళ్లూరి బ్రహ్మ య్య, పొన్నం వెంకటేశ్వరరావు, సిపిఐ నాయకులు బాల మల్లేష్, పశ్య పద్మ

Comments

comments