Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

టెక్స్‌టైల్ పార్కుతో ఎందరికో ఉపాధి : కెసిఆర్

TS-CM-KCR

వరంగల్ రూరల్ : వరంగల్‌లో మెగా టైక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని తెలంగాణ సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండలో ఆదివారం సాయంత్రం ఆయన మెగా టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సూరత్‌లో మహిళలు ధరించే వస్త్రాలు, తమిళనాడులో అండర్ గార్మెంట్స్, షోలాపూర్‌లో దుప్పట్లు, రగ్గులు తయారవుతాయని ఆయన చెప్పారు. వరంగల్‌లో నిర్మించనున్న మెగా టెక్స్‌టైల్ పార్కు పైమూడింటి కలయికేనని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లోనే కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు అతి పెద్దదని ఆయన పేర్కొన్నారు. అన్ని రకాల వస్తువులు దొరికే ప్రాంతంగా ఈ టెక్స్‌టైల్ పార్కు ఉండబోతుందని చెప్పారు. త్వరలోనే మామునూరు ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. వరంగల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి బంగారు వరంగల్‌గా మారుస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మంత్రులు కెటిఆర్, ఈటల రాజేందర్, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Employment with Textile Park : CM KCR

Comments

comments