Search
Wednesday 18 October 2017
  • :
  • :
Latest News

ఇంగ్లాండ్ ఉత్కంఠ విజయం

Soccer

కోల్‌కతా: అండర్17 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ వ రుసగా రెండో విజయాన్ని అందుకుంది. బుధవా రం ఇక్కడ జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ 32 గోల్స్ తేడాతో మెక్సికోను ఓడించింది. రెండు జట్లు కూడా దూకుడైన ఆటతో అభిమానులను కనువిందు చేశాయి. ఇంగ్లాండ్ ఆటగాళ్లు చూడచక్కని ఆటతో అలరించారు. మరోవైపు మెక్సికో ఆటగాళ్లు కూడా సర్వం ఒడ్డారు. ఇరు జట్ల ఆటగాళ్లు నువ్వానేనా అన్నట్టు సాగడంతో మ్యాచ్ యుద్ధాన్ని తలపించింది. ప్రారంభం నుంచే ఇరు జట్లు దూకుడుగా ఆడాయి. ఒకరి గోల్ పోస్ట్‌పై మరోకరు దాడి చేస్తూ గోల్స్ కోసం ప్రయత్నించాయి. అయితే తొలి అర్ధ గంటలో రెండు జట్లు కూడా ఒక్క గోల్ కూడా నమోదు చేయలేక పోయాయి. కానీ, 39వ నిమిషంలో బ్రెవ్‌స్టర్ ఇంగ్లాండ్‌కు తొలి గోల్ అందించాడు. దీంతో తొలి హాఫ్ ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 10 ఆధిక్యంలో నిలిచింది. ద్వీతీయార్ధంలో ఇంగ్లాండ్ మరింత చెలరేగి ఆడింది. మెక్సికో గోల్ పోస్ట్ వైపు వరుస దాడులు చేసింది. ఇదే క్రమంలో 48వ నిమిషంలో ఫొడెన్ జట్టుకు రెండో గోల్ అందించాడు. అంతేగాక మరో ఏడు నిమిషాల తర్వాత సాంచో ఇంగ్లాండ్‌కు మూడో గోల్‌ను సాధించి పెట్టాడు. మరోవైపు మెక్సికో కూడా స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో లైనెజ్ 65వ, 72వ నిమిషంలో మెక్సికోకు రెండు గోల్స్ అందించాడు. అంతేగాక మరో గోల్ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. కాగా, ఆధిక్యాన్ని చివరి వరకు నిలబెట్టుకోవడంలో సఫలమైన ఇంగ్లాండ్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.
ఫ్రాన్స్ జయభేరి
గువాహటిలో జరిగిన మరో మ్యాచ్‌లో ఫ్రాన్స్ 21 గోల్స్ తేడాతో జపాన్‌ను ఓడించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ చెమటోడ్చి విజ యం సాధించింది. ఆట ప్రారంభం నుంచే ఫ్రాన్స్ దూకుడుగా ఆడింది. స్టార్ ఆటగాడు అమినె గౌరి అద్భుత ఆటతో జట్టును ఆదుకున్నాడు. అమినె గౌరి 13వ, 17వ నిమిషాల్లో జట్టుకు రెండు గోల్స్ అందించాడు. రెండు గోల్స్ సాధించిన తర్వాత ఫ్రాన్స్ రక్షణాత్మక ఆటకే ప్రాధాన్యత ఇచ్చింది. ఈ క్రమంలో ఆ జట్టు ఆట ముగిసే లోగా మరో గోల్ ను నమోదు చేయలేక పోయింది. ఇదిలావుండగా జపాన్ కూడా స్కోరును సమం చేసేందుకు సర్వం ఒడ్డి పోరాడింది. అయితే బలమైన ఫ్రాన్స్ రక్షణ శ్రేణిని ఛేదించి ముందుకు వెళ్లలేక పోయింది.

Comments

comments