Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

నేలరాలుతున్నవిద్యాకుసుమాలు

students-image

ఉమ్మడి జిల్లాలో ఆగనివిద్యార్థుల ఆత్మహత్యలు వరుస విషాదాలతోభయానక వాతావరణం

చదువులఒత్తిడితట్టుకోలేక బలవన్మరణాలుకౌన్సెలింగ్ అవసరమంటున్ననిపుణులు

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ అర్బన్: చదువుల భారం మోయలేక, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఒత్తిడిని తట్టుకోలేక, తోటి విద్యార్థులు హేళనలను భరించలేక అనాలోచితంగా క్షణికావేశంలో తమ బంగారు భవిష్యత్‌ను చేతులారా పొగొట్టుకుంటూ పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలు ఉమ్మడి జిల్లాలోనే చాలానే జరుగుతున్నాయి. చదువులో ఒత్తిడిని జయించలేక కొందరు, తోటి విద్యార్థుల చేష్టలను భరించలేక కొందరు, తల్లిదండ్రుల భయంతో కొందరు ఇలా ఏదో ఒక బాధతో మానసిక క్షోభను అనుభవిస్తూ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. చక్కని చదువుతో తమ బంగారు భవితకు బాటలు వేసుకోవాల్సిన రేపటిపౌరులు విద్యార్థిదశలోనే నూరేళ్ల జీవితాన్ని ముగించుకుంటున్నారు.చదువుల ఒత్తిడి కారణంగా ఈ మధ్యకాలంలో ఉమ్మడి జిల్లాలో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వ చ్చాయి.

గత నెలరోజుల వ్యవధిలోనే నలుగురు విద్యార్థులు బలవన్మర ణాలకు పాల్పడ్డారు. విద్యార్థులకు సరైన అవగాహన లేకపోవడం, అనుభవలేమితో తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటు న్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రైవేట్ విద్యాసంస్థల మధ్య విపరీ తమైన పోటీ పెరిగిపోవడంతో వారి వారి పాఠశాల ఉనికిని కాపా డుకోవడానికి పక్క విద్యాసంస్థ కంటే మెరుగ్గా తమ విద్యార్థులు ర్యాం కులు సాధించాలనే ఉద్దేశ్యంలో విద్యార్థులపై మోపుతున్న భారానికి చదువుల ఒత్తిడిని భరించలేక మానసిక క్షోభకు గురవుతున్నారు.

తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకురావడం వల్ల తమలోని బాధను చెప్పుకోవడానికి ఎవరు లేకపోవడంతో తమలో తామే కృంగిపోయి క్షణికావేశంలో ఆనాలోచిత నిర్ణయాలు తీసుకుం టున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులను తీవ్రమైన ఒత్తిడికి గురి చేయడం, తరగతి గదిలో జరిగే అవమానాలు, తోటి విద్యార్థుల హేళన పలువురు విద్యార్థులపై ప్రభావం చూపుతున్నాయి. విద్యార్థులు చదు వులో రాణించలేక, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఒత్తిడిని భరించలేక నిండునూరేళ్ల జీవితాన్ని త్యజించుకుంటున్నారు. ప్రైవేట్ విద్యాసం స్థల యాజమాన్యాలు తమ సంస్థల పేరు, ప్రఖ్యాతుల కోసం, తమ వ్యాపారాల కోసం ర్యాంకుల పేరుతో విద్యార్థులను విరామం లేకుం డా, చదువులో వెనుకబడిన విద్యార్థులను సైతం గుర్తించకుండా ఒత్తిడి కి గురిచేస్తున్నారని పలువురు నిపుణులు వాపోతున్నారు.

తమ స్వలాభం కోసం మాత్రమే విద్యాసంస్థల యాజమాన్యాలు ఆలోచిస్తు న్నాయే తప్పా విద్యార్థుల జీవితాలపట్ల చిత్తశుద్ధి లేదనేది జగమెరిగిన సత్యం. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల బంగారు భవిష్యత్ బాగుం డాలని ఆలోచిస్తేన్నారే తప్ప వారికి చదువు వల్ల కలిగే ఒత్తిడిని గమనిం చలేకపోతున్నారు. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోయాక తల్లిదం డ్రులు మనోవేదనకు గురవుతున్నారు. విద్యార్థులు సైతం చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి చదివేలా ఉండాలని, చదువులో ఒత్తిడి గురి కాకుండా ఆట, పాటలు, సాంస్కృతిక, వినోద కార్యక్రమాల్లో పాల్గొ న్నాలని నిపుణులు సూచిస్తున్నారు. చదువుల భారం మోయలేనివారు, చదువులో వెనుబడివారు చదువుతోనే జీవితం ముగిసిపోయినట్లుగా భావించకుండా ఉండాలి. ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందనే సత్యాన్ని గ్రహించి దానికి అనుగుణంగా తమలోని నైపు ణ్యాన్ని పెంపొందించుకుని ఇతర రంగాల్లో రాణించి తమ భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి.

విద్యార్థులు ఒత్తిడికి గురైన, మానసిక క్షోభను అనుభవిస్తున్న తల్లిదండ్రులతో చర్చించాలి. అభద్రతాభావంతో కాకుం డా విద్యార్థులు ధైర్యంగా ఉండాలని జీవితాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని ఉన్నతశిఖరాలను అధిరోహించేలా ప్రణాళికలను రచిం చుకుని ముందుకు సాగాలి కానీ బలవన్మరణాలకు పాల్పడుతూ తల్లి దండ్రులకు విషాదాన్ని అందించకూడదు. ఏదీఏమైనా తొందరపాటు లో, క్షణికావేశంలో అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల తల్లి దండ్రులకు తీవ్ర మనోవేదనను మిగుల్చుతున్నాయి. విద్యార్థులు ఆలో చించి సరైన మార్గాలను ఎంచుకుని ముందు కు సాగాలని, అధైర్యప డకుండా తమ బంగా రు భవిష్యత్‌కు బాటలు వేసుకుని రేపటి తరా నికి ఉత్తమపౌరులుగా ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కౌన్సెలింగ్‌లు నిర్వహించాలి…
విద్యార్థులకు సరైన అవగాహన లేకపోవడం తోనే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటు న్నారని, ప్రతి విద్యాసంస్థలో ప్రత్యేకమైన అవ గాహన కార్యక్రమాలను నిర్వహించాలని ని పుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదువుల భారం విద్యార్థులపై పడకుండా వి ద్యాధికారులు, విద్యాసంస్థల యాజమాన్యా లు, తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టిని సారించా లని, విద్యార్థులు అభద్రతాభావానికి లోనుకా కుండా మానసిక నిపుణుల చేత కౌన్సిలింగ్ ఏ ర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందం టున్నారు. విద్యార్థులను ఎల్లప్పుడు చదువుల కే పరిమితం చేయకుండా ఆట, పాటలు, సాంస్కృతిక, వినోద కార్యక్రమాల్లో పాలుపం చుకునే ప్రోత్సహించాలని, యోగా వంటి మ నసుకు ప్రశాంతతను ఇచ్చే కార్యక్రమాల ద్వా రా విద్యార్థులను మనోవేదన నుంచి దూరం చేయొచ్చని తెలిపారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై ఒత్తిడికి గురి చేయకుండా స్నేహితుడి మాదిరిగా అన్ని విషయాలను తెలుసుకుంటూ ప్రోత్సహించాలని, పిల్లలను చదువులకే పరిమితం చేయకుండా ఇతరాత్ర కార్యక్రమాల్లో సైతం పాల్గొనేలా చూడాలని నిపుణులు తెలుపుతున్నారు.

విద్యారంగంపై ప్రత్యేక దృష్టిని సారించాలి…

విద్యారంగంపై ప్రత్యేకదృష్టిని సారించి వి ద్యాప్రమాణాలను పెంచడంతోపాటు విద్యా ర్థుల ప్రాణాలను సైతం కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. విద్యాసంస్థల్లో అన్ని సౌ కర్యాలను కల్పించేలా, అవగాహన కార్యక్ర మాలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీ సుకోవాలి. అధికారులు సైతం విద్యాసంస్థల ను తనిఖీ చేస్తూ చదువుల ఒత్తిడి, ఫీజుల భా రంపై విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశా లు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉం ది. ప్రభుత్వాలు సైతం విద్యార్థులు ఆత్మహత్య లకు పాల్పడకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి, విద్యాసంస్థల్లో అవగాహన కా ర్యక్రమాలను ఏర్పాటు చేయాలి. ఫీజుల ని యంత్రణపై ప్రత్యేకమైన ప్రణాళికలను రూ పొందించి, ప్రైవేట్ విద్యాసంస్థలకు సరైన ఆదేశాలు జారీ చేసి ఉమ్మడి జిల్లాలోని వరుస గా చోటుచేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహ త్యలపై ప్రత్యేకమైన దృష్టిని సారించి భావిత రాలను కాపాడాలని పలువురు కోరుతు న్నారు.

Comments

comments