Search
Thursday 22 February 2018
  • :
  • :
Latest News

నవ జంట దారుణ హత్య

తమను కాదని ప్రేమించి పెళ్ళి చేసుకున్నదని మేనకోడలిని, ఆమె భర్తను  కత్తులతో పొడిచి చంపిన మేనమామలు,  సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ మండలంలో ఘాతుకం

Murder

వేములవాడ: ప్రేమించి పెళ్ళి చేసుకొన్న నవదంపతులను దారుణంగా హతమార్చిన సం ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ మండలం బాల్‌రాజ్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మండలంలోని వెంకటాంపల్లికి చెందిన రచన(21),బాల్‌రాజ్‌పల్లి గ్రామానికి చెందిన హారీశ్ (23)అనే ఆటోడ్రైవర్‌ను ప్రేమించి పెళ్లి చేసు కుంది.తమను కాదని పెళ్లి చేసుకున్న రచన పై మేనమామలైన నాగారాజు,అశోక్, శేఖర్‌లు పగ పెంచుకొని గురువారం బాల్‌రాజ్‌పల్లిలో రచన, ఆమె భర్త హరీశ్‌లపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. హారీశ్ తల్లి రాజేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితులు పరారీలో ఉన్న ట్లు తెలిసింది.

Comments

comments