Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

పిడుగుపాటుకు రైతు మృతి

BENZIMAN

ఖమ్మం : పిడుగుపాటుకు రైతు మృతి చెందాడు. ఈ ఘటన బోనకల్లు మండలం రామాపురంలో శనివారం ఉదయం జరిగింది. రామాపురం గ్రామానికి చెందిన బండి బెంజిమన్ బోనకల్లులో స్థిరపడ్డాడు. రామాపురం ఊర చెరువు కింద తన వరిపొలంలో పని చేస్తుండగా శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో పొలం సమీపంలోని చెట్టు కిందికి వెళ్లాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో బెంజిమన్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు. బెంజిమన్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Farmer Killed by Thunder bolt

Comments

comments