Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

పాలు తాగలేదని పాపకు పాశవిక శిక్ష

పెంపుడు తండ్రి అరెస్టు.. బాండుపై విడుదల

Baby

హూస్టన్ : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో మూడేళ్ల భారతీయ బాలిక కనపడటం లేదని మీడియా వార్తలు తెలుపుతున్నాయి. ఆ పాప పాలు పూర్తిగా తాగ లేదని రాత్రంతా ఒంటరిగా బయట నిలబడి ఉండే శిక్ష ఆమె పెంపుడు తండ్రి విధించటంతో ఆమె తప్పిపోయిందని మీడియా తెలిపింది. భారతదేశంలోని ఒక అనాథాశ్రమం నుంచి షరీన్ మాథ్యూస్ అనే ఆ బాలికను రెండేళ్ల క్రితం వెస్లీ మాథ్యూస్ అనే వ్యక్తి దత్తత తీసుకున్నాడు.

అయితే శనివారం తెల్లవారు జామున మూడు గంటల నుంచి ఆమె కనపడటం లేదని ఎన్‌బిసి తెలిపింది. దీంతో శనివారం రాత్రి వెస్లీని రిచర్డ్‌సన్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆదివారం రాత్రి 2,50,000డాలర్ల బాండుపై అతడిని విడుదల చేశారు. హూస్టన్ క్రానికల్ ఈ వార్తను సమగ్రంగా ప్రచురించింది. ఇదిలా ఉండగా ఆ పాప ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదని, పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారని అక్కడి మీడియా సంస్థలు ప్రచురించాయి.

Comments

comments