Search
Monday 11 December 2017
  • :
  • :

విదేశి విద్యల స్వదేశి పద్మం

videshi

డిగ్రీ చేతికందగానే విదేశాలవైపు చూసే విద్యార్థుల సంఖ్య పెరిగింది. విదేశాలకు వెళ్లాలనుకునే స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ వారి ఇంగ్లిష్ భాషా సామర్థాన్ని పెంచుకునేందుకు  ఐఇఎల్‌టిఎస్(ఇంటర్‌నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం) కోచింగ్ తీసుకోవడం తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లాలనుకునేవారికి బెస్ట్ ట్రైనింగ్ సెంటర్స్. ట్రైనర్స్ దొరకడం ఓ వరం. ట్రైనింగ్ తీసుకోవాలని ఎందరికో ఉన్నా సమయం, అవకాశం దొరకకపోవడం ఓ మైనస్ పాయింట్ అవుతుంది. సరిగ్గా ఇలాంటివారి కోసం  పద్మజ గాంధీ అందించే ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ను మన తెలంగాణ త్వరలోనే మీ ముంగిట్లోకి తీసుకురాబోతోంది… 

మాట్లాడే పదాల్లో జీవం, ఎఫెక్టివ్ కమ్యునికేషన్, అత్యంత స్ఫూర్తిదాయక విగ్రహం కలగలిసిన వ్యక్తి పద్మజ గాంధీ. గత 34 సంవత్సరాలుగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఇన్‌స్ట్రక్టర్‌గా లక్షలమంది విద్యార్థులకు శిక్షణ అందించారీమె. పద్మజ వద్ద శిక్షణ తీసుకున్న విద్యార్థుల్లో 90% మంది విజయం సాధించి విదేశాలకు వెళ్లారు. బ్రిటిష్ కౌన్సిల్ ఐఇఎల్‌టిఎస్ పార్టనర్‌షిప్ ప్రోగ్రాంలో భాగంగా దక్షిణ భారతదేశం నుంచి ఎన్నో అవార్డులందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక విద్యాసంస్థల్లో గౌరవ సభ్యురాలిగా వ్యవహరించారు. విదేశీ భాష నేర్పడంలో పయోనీర్‌గా నిలిచారు. విద్యావేత్తగా, సోషల్ రిఫార్మర్‌గా నిలిచి, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పద్మజ తన సేవలందించారు. వృత్తి, విద్యకు సంబంధించిన అనేక మాన్యువల్స్‌ను రాసి ప్రచురించారు. మోటివేషనల్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసుల నిర్వహణను ప్రవృత్తిగా స్వీకరించారు. గత రెండు సంవత్సరాలుగా రామకృష్ణ మఠంలో ఐఇఎల్‌టిఎస్ ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తూ, 1500 మంది విద్యార్థులకు శిక్షణ అందించారు. నగరంలో పుట్టి పెరిగిన పద్మజ ఉస్మానియా యూనివర్సిటిలో ఇంగ్లిష్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆర్క్ ఐఇఎల్‌టిఎస్ అకాడమి స్థాపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఐఇఎల్‌టిఎస్ శిక్షణ అందించిన మొదటి వ్యక్తిగా, మహిళగా పద్మజ నిలిచారు…
వివిధ వయసులవారికి, రకరకాల తరగతుల ద్వారా శిక్షణ ఇచ్చి వారిలో నైపుణ్యాలకు మెరుగులద్దారు. విద్యార్థుల ఇంట్రెస్ట్, సామర్థాలకు అనుగుణంగా ఇంగ్లిష్ పాఠాలను ప్లాన్ చేసి రీడింగ్, రైటింగ్, స్పీకింగ్‌లో వారి పర్‌ఫార్మెన్స్‌ను మెరుగుపర్చారు.విద్యార్థులకు శ్రద్ధతో వ్యక్తిగతంగా శిక్షణ అందించారు.
ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ : విద్యావిధానంలో మార్పుకోసం సరికొత్త లర్నింగ్ టూల్స్ సమకూర్చుకున్నారు. సామాజిక, సమాచార నైపుణ్యాలను తాను రూపొందించిన విద్యావిధానంలో చేర్చారు.

Comments

comments