Search
Thursday 22 February 2018
  • :
  • :

‘పద్మావతి’ మూవీలోని ‘ఘుమర్’ వీడియో సాంగ్…

Deepika-Padukone

బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే, రణ్‌వీర్‌సింగ్, షాహిద్ కపూర్‌ హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పద్మావతి’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ‘పద్మావతి’ సినిమాలోని ‘ఘుమర్ ఘుమర్’ అంటూ సాగే వీడియో సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఎప్పటిలాగే బన్సాలీ తనదైన శైలిలో రిచ్‌నెస్‌తో పాటను సూపర్బ్ గా తెరకెక్కించాడు. ఇక పాటపై దీపికా అభినయం గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. రాణి పద్మినిగా దీపికా, అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్, మహారావల్ రతన్ సింగ్‌గా షాహిద్ తమతమ పాత్రల్లో ఒదిగిపోయారనే చెప్పాలి. ‘పద్మావతి’ చిత్రం డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తాజాగా విడుదలైన ‘ఘుమర్ ఘుమర్’ వీడియో సాంగ్ మీ కోసం…

Ghoomar Video Song from Padmavati Movie.

Comments

comments