Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి దీక్ష

Girlfriend-Strike

ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడు
న్యాయం చేయాలంటూ బాధితురాలి ఆందళోన
దీక్షా ప్రాంగణంలోనే పెళ్ళి చేయాలని డిమాండ్

కొత్తగూడెం: ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని మోసం చేసాడంటూ ఓ యువతి తన ప్రియుడి ఇంటి ఎదుట నిరాహారదీక్ష చేపట్టింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…. సుజాతనగర్ మండలంలోని సర్వారం గ్రామపంచాయితి గోపాతండాకి చెందిన ఒక యువతిని చుంచుపల్లి మండలంలోని హౌసింగ్‌బోర్డ్ కాలనీకి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసాడంటు బాధితురాలు ఆందోళనకు దిగింది. ఏడాదిన్నర కాలంగా ప్రేమిస్తు పెళ్ళి చేసుకుంటానని పెద్ద మనుషులతో మాట్లాడుతానంటు నమ్మబలికి కాలం వెల్లబుచ్చాడని ఆవేదన వ్యక్త పరిచింది. యువకుడు, తన కుటుంబసభ్యులు పది రోజుల నుండి ఇంటికి తాళం వేసి కనబడకుండ పోవడంతో అసహానానికి గురైన యువతి తన ప్రియుడి ఇంటి ముందు భైటాయించింది. న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష విరమించనని భాదితరాలు తెలిపింది. కొందరు పెద్ద మనుషులు పెళ్ళి జరగకుండా చూస్తున్నారని అందుకే ప్రియుడిని పరారీలో ఉంచి తెరవనుక కథ నడుపుతున్నారని ఆరోపించింది. సంబంధిత విషయంపై పోలీస్ స్టేషన్‌లో కూడ ఫిర్యాదు కాకపోవడం గమనార్హం. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం కంటే ప్రిముడితో వివాహాం జరిగితే బాధితరాలికి న్యాయం జరిగినట్టేనని భాధితుల వాదన. పరారీలో ఉన్న ప్రియుడు వచ్చేవరకు తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని యువతి చెబుతోంది. కుటుంబీకులు, గ్రామస్తుల సహాకారం ఇవ్వడంతో పోరాటం చేయాడానికి కొండంత ధైర్యం వచ్చిందని యువతి కంటతడి పెట్టుకున్న దృశ్యం పలువురిని కలవర పెట్టింది. తన ప్రియుడిని వెంటనే తీసుకొచ్చి దీక్షా ప్రాంగణంలోనే తనతో వివాహాం జరిపించాలని లేని పక్షంలో ప్రాణత్యాగానికైన వెనకాడబోనని యువతి వాపోయింది. అధికారులు, గ్రామ పెద్దలు సహాకరించి తనకు న్యాయం చేకూర్చాలని కోరింది.

Comments

comments