Search
Wednesday 18 October 2017
  • :
  • :
Latest News

క్రీడలతో మంచి గుర్తింపు: మాస్టర్ సచిన్

Sachibn

న్యూఢిల్లీ: క్రీడల్లో రాణించడం ద్వారా యువతులు మంచి గుర్తింపు పొందవచ్చని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా యు నిసెఫ్ నిర్వహించిన కార్యక్రమంలో సచిన్ ప్రసంగించాడు. యునిసెఫ్‌కు సచిన్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలికలను ఉద్దేశించి అతను మాట్లాడాడు. క్రీడల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం అధికంగా ఉంటుందన్నాడు. ఇప్పటి కే చాలా మంది యువతులు క్రీడల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన విషయాన్ని గుర్తు చేశాడు. మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, పివి.సింధు, టెన్నిస్ సంచలనం సాని యా మీర్జా, బాక్సింగ్ దిగ్గజం మేరికోం, జి మ్నాస్ట్ దీప, అథ్లెట్లు అంజుబాబి జార్జ్, పిటి. ఉష తదితరుల పేర్లను సచిన్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. క్రీడల్లో మహిళలు పాల్గొనాల్సిన అవసరం ఎంతైన ఉందన్నాడు.  క్రీడల్లో బలమైన శక్తిగా ఎదగాలంటే యువతులు దీనిలో పాలుపంచుకోవాల్సిందేనన్నా డు. ప్రతి అమ్మాయి క్రీడల్లో పాల్గొనాలని, త మకు ఇష్టమైన క్రీడాంశాన్ని ఎంచుకొని దాని లో ముందుకు సాగాలని సూచించాడు. క్రీడ ల్లో రాణించడం ద్వారా సమాజంలో ఉన్నత శిఖరాలకు అదిరోహించవచ్చని వివరించాడు. ఇప్పటికే చాలా మంది అమ్మాయులు ఈ విషయాన్ని ఆచరణలో నిరూపించారని సచిన్ అ న్నాడు. కాగా, ఈ కార్యక్రమంలో భారత మ హిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ తదితరులు కూడా పాల్గొన్నారు.

Comments

comments