Search
Wednesday 18 October 2017
  • :
  • :
Latest News

భారీ బ్రేక్‌ఫాస్టే బెటర్

                      Break-Fast

డైటింగ్ చేసేవారు ఇప్పటినుంచి న్యూట్రీషన్ లిస్ట్‌పై కాకుండా గడియారం పై దృష్టి పెట్టాలని సూచిస్తున్నాయి స్టడీస్. రాత్రి కంటే ఉదయం పూట భారీస్థాయి ఆహారం తీసుకునేవారిలో బిఎమ్‌ఐ స్థాయిలు తక్కువగా నమోదవుతున్నాయని ఈ స్టడీస్ తెలియజేస్తున్నాయి. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలనే అవగాహన నేడు అందరిలో వచ్చినా, రాత్రి పూట తక్కువ, ఉదయం ఎక్కువ కెలోరీలు తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుందన్నది తెలియాలి . ఈ రకమైన ఆహార అలవాటు వల్ల ఒబెసిటీ దరిచేరదు. హృదయ సంబంధ అనారోగ్యాలు, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్‌చేసేవారి ధమనుల్లో కొవ్వు చేరి మూసుకుపోతాయని(ఆథ్రోస్క్లెరోసిస్) అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో పబ్లిష్ అయిన స్టడీ తెలుపుతోంది.

ఉదయపు ఆహారం భారీగా తీసుకునేవారిలో ఈ ముప్పు ఉండదని కూడా ఈ స్టడీస్ తెలియజేస్తున్నాయి. అలాగే ఉదయాన్నే ఎక్కువ శక్తిని వినియోగించేవారిలో కూడా కార్డియోవాస్కులార్ హెల్త్ బాగుంటుందని ఈ స్టడీ టీం ను లీడ్ చేసిన డాక్టర్ వాలెంటీన్ ఫస్టర్ తెలియజేస్తున్నారు. దురదృష్టవశాత్తు దీనికి పూర్తి వ్యతిరేకంగా మన దినచర్య ఉంటుంది. ఉదయాన్నే ఏదో తిన్నామనిపించేసి రాత్రి భోజనం భారీగా చేస్తూంటాం. ఎక్సర్‌సైజ్ చేయడానికీ బద్ధకిస్తూంటాం. సంప్రదాయ ఆహార అలవాట్లున్న 50,000 మంది(పెద్దవారు) దినచర్యను పరిశీలించగా, వారి ఉపవాసపు అలవాట్లు బరువు తగ్గేందుకు దోహదమవుతున్నాయని తేలింది.

ఈ స్టడీలో పాల్గొన్నవారిలో 8% మంది తక్కువ బిఎమ్‌ఐ స్థాయిలు కలిగి ఉన్నారు. వీరిలో చాలామంది 18 గంటలు ఉపవాసం చేసి ఒకేసారి భారీగా బ్రేక్‌ఫాస్ట్ లేదా బ్రంచ్(బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఒకేసారి భోజనం చేయడం) చేసేవారున్నారు. శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగించేలా శరీరానికి ఉపవాసం సిగ్నల్స్ పంపుతుందని రీసెర్చర్స్ అంటున్నారు. ఫీస్ట్-ఫాస్ట్ అన్నట్లుగా మానవ శరీర నిర్మాణం ఉంటుందని వీరంటున్నారు. అయితే ఉపవాసం, ఆహరం తీసుకోవడం మధ్యన కొంత ఎక్సర్‌సైజ్ ఉండాలని వీరు సూచిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేసేవారిలో, ఆహారాన్ని సమయానుసారం తీసుకోనివారిలో స్థూలకాయ సమస్య తలెత్తుతోందని ఈ స్టడీస్ తేల్చాయి. అందుకే ఇప్పటినుంచి న్యూట్రీషన్ లిస్ట్ కంటే బాడీ క్లాక్, వాల్ క్లాక్‌లపై శ్రద్ధ పెట్టడం అవసరమని చెబుతున్నారు పరిశోధకులు.

Comments

comments