Search
Tuesday 19 June 2018
  • :
  • :

హైదరాబాద్‌లో భారీ వర్షం

Heavy-rain-in-Hyderabad

హైదరాబాద్ : హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో గురువారం సాయంత్రం నుంచి భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట , ఖైరతాబాద్, అమీర్‌పేట, కూకట్‌పల్లి, కవాడీగూడ, ముషీరాబాద్, ట్యాంక్‌బండ్ , కోఠి, ఆబిడ్స్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బినగర్,హయత్‌నగర్, చంపాపేట్, సంతోషనగర్, పిసల్‌బండ తదితర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడుతోంది. భారీ వర్షంతో జంటనగరాల ప్రజలు అతలాకుతలమవుతున్నారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. జంట నగరాల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండకాసి, సాయంత్రం కాగానే భారీ వర్షం పడుతుండడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగానే  తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Heavy rain in Hyderabad

Comments

comments