Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు

BGKS

భద్రాద్రి కొత్తగూడెం : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు , ఎంపి కవిత తెలిపారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కవిత కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు గనుల్లో ఆమె మంగళవారం పర్యటించారు. సింగరేణి కార్మికులపై సిఎం కెసిఆర్‌కు అపారమైన ప్రేమ ఉందని ఆమె పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం సిఎం పాటుపడుతున్నారని ఆమె చెప్పారు. వారసత్వ ఉద్యోగాల కోసం సిఎం జిఒ తెస్తే కొందరు స్వార్థపరులు కోర్టుకు వెళ్లి జిఒపై స్టే తెచ్చారని ఆమె విమర్శించారు. కారుణ్య నియామకాల ద్వారా వారసత్వ ఉద్యోగాలను ఇచ్చేందుకు కెసిఆర్ సిద్ధంగా ఉన్నారని ఆమె చెప్పారు. కార్మికులు సొంతింటిని నిర్మించుకునేందుకు ఆరు లక్షలు వడ్డీ లేని రుణాన్ని అందిస్తామన్నారు.

Heritage jobs in Singareni

Comments

comments