Search
Wednesday 21 February 2018
  • :
  • :

హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ACHAL

ఢిల్లీ : హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబరు 9వ తేదీన జరగనున్నాయి. గురువారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అచల్ కుమార్‌జ్యోతి హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈనెల16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 18న ఉంటుంది. ఎన్నికల కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని అచల కుమార్ జ్యోతి తెలిపారు. . అదేవిధంగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను సైతం డిసెంబర్ 18లోగానే పూర్తిచేస్తామని సీఈసీ పేర్కొన్నారు. తమిళనాడులోని ఆర్కే నగర్‌ నియోజక వర్గానికి ఉప ఎన్నికను డిసెంబర్‌ 31లోగా నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సిఇసి) చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఆ నియోజక వర్గానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.

Himachal Pradesh Assembly Elections Schedule Released

Comments

comments