Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

ప్రేమ పేరుతో మైనర్ బాలికను తీసుకెళ్లిన హాస్టల్ పిఆర్‌ఓ

పోలీస్‌స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదు

Lovers

మన తెలంగాణ/జగిత్యాల టౌన్ : జగిత్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని అదే కళాశాల హాస్టల్‌లో పనిచేస్తున్న పిఆర్‌ఓ ప్రేమ పేరుతో నాలుగు రోజుల క్రితం కళాశాల నుంచి తీసుకెళ్లగా బాలిక కుటుంబ సభ్యులు గురువారం ఆందోళన చేశారు. బీర్‌పూర్ మండలం కొల్వాయి గ్రామానికి చెందిన విద్యార్థిని వాణీ జూనియర్ కళాశాల హాస్టల్‌లో ఉంటూ సిఇసి మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే అదే కళాశాల హాస్టల్‌లో పిఆర్‌ఓ, స్టడీ ట్యూటర్‌గా కోరుట్ల మండలం సంగెం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ పని చేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి తీసుకు పోయాడు. ఈ విషయాన్ని ఆమె కళాశాల ప్రిన్సిపాల్‌కు తెలియజేయడంతో పాటు బాలిక తల్లికి ఫోన్ ద్వారా వివరించింది. అయితే తన బిడ్డ కళాశాల నుంచి వెళ్లి నాలుగు రోజులు గడిచినా తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన బాలిక తల్లి, కుటుంబ సభ్యులు గురువారం జగిత్యాలకు చేరుకుని కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. చంద్రశేఖర్‌గౌడ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కళాశాల ఎదుట ఆందోళన జరుగుతున్న విషయం తెలుసుకున్న టౌన్ ఎస్‌ఐ ప్రసాద్ అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మైనర్ బాలికను తీసుకెళ్లిన వ్యక్తిపై ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు. కళాశాల హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

comments