Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

అనుమానం పెనుభూతమై…

Woman-Murdered

పాల్వంచ: అనుమానం పెనుభూతమైతే ఎంతటి అగాయిత్యానికైనా ఒడికడ్తారు అనడానికి  నిదర్శనం సోమవారం జరిగిన ఈ సంఘటనే. అనుమానంతో ఓ భర్త తన భార్యను గొడ్డలితో నరికి చంపాడు. సంఘటన మండల పరిధి నాగారం గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల, పోలీసుల కథనం ప్రకారం…. వివరాలిలా ఉన్నాయి. ములకలపల్లి, భగత్‌సింగనగర్‌కు చెందిన తాళ్ల కన్నయ్య, విజయ నిర్మల (35)లు భార్యాభర్తలు. గత 2 నెలల క్రితం తోగ్గూడెం-నాగారం మధ్య రోడ్‌లో ఉన్న ఓ కోళ్ళఫామ్‌లో పని చేసేందుకు వలస వచ్చారు.

కోళ్ల ఫాం దగ్గరే నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. గత కొద్ది రోజులుగా విజయనిర్మలపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపధ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. సోమవారం ఇద్దరి మధ్య ఘర్షణ ఎక్కువ కావడంతో కోపోద్రేకుడైన కన్నయ్య పక్కనే ఉన్న గొడ్డలితో భార్య తలపై నరికాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. వీరికి ఓ కుమార్తె, కొడుకు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాల్వంచ ఏరియా వైద్యశాలకు తరలించారు. గ్రామీణ ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments