Search
Wednesday 21 February 2018
  • :
  • :

అతడి బౌలింగ్‌లో భయపడ్డా!

                       sehwag1

ముంబయి: శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య ము రళీధరన్ బౌలింగ్ అంటే తనకు చాలా భయంగా ఉండేదని భారత విధ్వంసక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. టెస్టుల్లో మురళీ బౌలింగ్‌కు వచ్చాడంటే తనలో ఒక రకమైన భయం నెలకొనేదన్నాడు. అతని బౌలింగ్‌లో తాను చాలా సార్లు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నానని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నాడు. అతని ముఖకవిళికలు చూస్తేనే తనలో ఏదో రకమైన ఆందోళన మొదలయ్యేదన్నాడు. అతని ఓవర్ ఎప్పుడూ పూర్తవుతుం దా అని అతృతగా ఎదురు చూసేవాడినని సెహ్వా గ్ అన్నాడు. అతను తప్ప మిగతా అందరి బౌలింగ్‌ను తాను సునాయాసంగా ఎదుర్కొన్నానని వివరించాడు. కాగా, మెక్‌గ్రాత్, బ్రెట్‌లీ, షోయబ్ అక్త ర్, షేన్‌వార్న్ వంటి బౌలర్లు తనపై పెద్దగా ప్రభా వం చూపలేక పోయారన్నాడు. డిఫెన్స్ ఆడాలంటే తనకు ఇష్టం ఉండేది కాదని, అందుకే తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురు దాడికి దిగేవాన్ననని సెహ్వాగ్ తెలిపాడు.

Comments

comments