Search
Wednesday 20 June 2018
  • :
  • :

అమెరికాతో పాటు భారత్, చైనాలో పెరుగుతున్నఅసమానతలు

                  Flag

వాషింగ్టన్  : భారత్, చైనా, అమెరికాలలో అంత రాల అడ్డుగోడలు పెరిగిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే సగటున అసమానతలు తగ్గు ముఖం పడుతున్నాయి. అయితే సంపన్న దేశం అమెరికా, ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్న చైనా, భారత్‌లో ఈ అసమానతలు అంతకంతకు పెరిగి పోతున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) బుధవారం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో ప్రగతి, అవకాశాల కల్పన వంటి కీల క అంశాలపై ఐఎంఎఫ్ దృష్టి సారించింది. విద్య, వైద్య ఆరోగ్య పరిరక్షణ వంటి సేవల ఫలాలు జనాభాలోని వివిధ వర్గాల మధ్య సముచిత రీతి లోనే సగటున నమోదు అయ్యాయి. అత్యధిక దేశాలలో ఈ పరిణామం నెలకొంది.

ప్రపంచ వ్యాప్తంగా పౌరుల పరిస్థితిని చూస్తే అసమానతల ధోరణి గణనీయంగా తగ్గింది. 19వ శతాబ్దం ఆరంభం నుంచి క్రమేపీ ఈ పరిణామం కన్పిస్తూ వస్తోందని ఐఎంఎఫ్  ద్రవ్య వ్యవహారాల విభా గం డైరెక్టర్ విటర్ గస్పర్ తెలిపారు. తలసరి ఆదా య గణాంకాలను బట్టి చూస్తే మొత్తం మీద సరైన పరిణామం నెలకొంది. అయితే దేశాల వారీగా చూస్తే  ఈ పరిస్థితి ఉండగా , చైనా, అమెరికా, భారత్ వంటి పెద్ద దేశాలలో అసమానతలు పెరి గిపోతూ ఉండటంతో జనాభా కోణంలో చూస్తే  ప్రపంచంలో ఇప్పుడు అత్యధిక జనం ఈ అస మానతల నడుమ ఉన్నట్లుగా గుర్తించాల్సి  ఉం టుందని తెలిపారు. ఆర్థిక వృద్ధి ఉన్న దేశాలలోనే అసమానతలు పెరిగిపోవడాన్ని తాము గుర్తించిన ట్లు గాస్పర్ తెలిపారు. విద్యా, ఆరోగ్యం వంటి వా టిలో పెట్టుబడులతో క్రమేపీ అసమానతలను తొలిగించుకోవచ్చు. అన్ని దేశాలూ తమతమ ద్రవ్య విధానాలను సరైన విధంగా రూపొందిం చుకోవడం, ప్రత్యేకించి సమీకృత, సమగ్ర అభివృ ద్ధికి మార్గం వేసుకోవడం ద్వారా అవలక్షణాలను సరిచేసుకునేందుకు వీలేర్పడుతుందని ద్రవ్య సంస్థ తెలిపింది.

Comments

comments