Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

కల్వకుర్తి కల పండింది

కెఎల్‌ఐ 29వ ప్యాకేజీ వద్ద కృష్ణ నీటిని విడుదల చేస్తూ మంత్రి హరీశ్‌రావు

Harish-rao

కల్వకుర్తి : కల్వకుర్తి ప్రజల 30 ఏళ్ళ కల  నేడు నెరవేరిందని కృష్ణమ్మ జ లాలతో కల్వకుర్తి వారి పాదాలు కడిగామని  రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఉమ్మడి పాల మూరులో పర్యటించి కెఎల్‌ఐ 29వ ప్యాకేజీ ద్వారా వస్తున్న సాగునీటికి  కల్వకుర్తి మండ లం ఎల్లికట్ట తాండ వద్ద కృష్ణమ్మ కు ప్రత్యేక పూజలు చేసి స్వాగతం పలికారు. మంత్రికి, జి ల్లా మంత్రులకు పెద్దఎత్తున ఎంఎల్‌ఎలు, ఎం ఎల్‌సి కసిరెడ్డి నారాయణరెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం కల్వకుర్తి పట్టణంలో టి ఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జైపాల్ యాద వ్ ఆధ్వర్యంలో నిర్వహంచిన మహాసభలో  హరీష్‌రావు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి  ప్రజల సంక్షేమం అవసరమని దాని కోస పాలమూరు జిల్లా  ప్రాజెక్టుల పూర్తి కోసం 1000కోట్లు, 1200కోట్లు రెండు దఫాలుగా నిధులు మంజూరు చేసి 33వేల ఎకరాలకు సాగునీరు అందించే కార్య క్రమం చేపట్టామని  జిల్లా ప్రాజెక్టులను అడ్డుకునేందుకు  ప్రతి పక్షాలు కోర్డులో కేసులు వేసి ఆరు నెలల కింద కల్వకుర్తి రావాల్సిన సాగునీటికి అడ్డంకులు సృష్టించారని ఆయన అన్నారు. కాం గ్రెస్ పార్టీకి కోర్టులు అవసరం  టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి  ప్రజలను నమ్మి పని చేస్తామని ఆయన అన్నారు. ఆమనగల్లు మినీట్యాంక్ బండ , తలకొండపల్లిలో భారీ వర్షాలకు కురిసిన చెరువులు ,కుంటల మరమత్తుకు నాల్గొవ విడుత మిషన్ కాకతీయ పనుల కింద అధికారులను పంపించి రెండు , మూడు రోజుల్లో పనులు పూర్తి చేయిస్తానని చెప్పారు. 2019నాటికి పాలమూరు జిల్లాకు 20లక్షల సాగునీరు అందించే లక్షంగా  పని చేస్తామని ముఖ్యమం త్రి కేసీఆర్ ఆదేశాలతో జిల్లా మం త్రులం ,ఎమ్మెల్యేం  ప్రాజెక్టుల వద్ద ఉండి పనులు చేశామని మం త్రి అన్నారు.

Comments

comments