Search
Wednesday 18 October 2017
  • :
  • :
Latest News

బాధ్యత పెరిగింది : సమంత

SAM

హైదరాబాద్ : హీరోయిన్ సమంత , హీరో అక్కినేని నాగ చైతన్యలు ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తరువాత సమంత తన పేరు మార్చుకుంది. ఇప్పుడు ఆమె అక్కినేని సమంతగా మారింది. అక్కినేని పేరుతో తన బాధ్యత మరింత పెరిగిందని ఆమె తెలిపారు. అక్కినేని అభిమానుల అంచనాలకు అనుగుణంగా నడుచుకుంటానని ఆమె స్పష్టం చేశారు. తన భర్త, తన అత్తగారి కుటుంబం ఎటువంటి ఆంక్షలు విధించకుండా సినిమాల్లో నటించేందుకు ఎంతో స్వేచ్ఛనిచ్చారని ఆమె స్పష్టం చేశారు. ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున , సమంత నటించిన రాజుగారి గది-2 శుక్రవారం విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాగార్జున, సమంతలు గురువారం మీడియాతో మాట్లాడారు.

Liability Increased: Samantha

Comments

comments