Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం

Attempt-Suicide

వేములవాడ: వేధిస్తున్నాడంటూ భార్య ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ కోసం పోలీసు స్టేషన్‌కు పిలిపించిన వ్యక్తి క్రిమిసంహారక మందును మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నూర్జహాన్, జాకిర్‌లు భార్యాభర్తలు. గత కొంత కాలంగా నూర్జహాన్‌ను జాకిర్ వేధిస్తుండగా ఆమె భర్త వేధింపులు భరించలేక వేములవాడ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కౌన్సెలింగ్ కోసం జాకిర్‌ను వేములవాడ పోలీస్ స్టేషన్‌కు శనివారం మధ్యాహ్నం పిలిపించారు. కౌన్సెలింగ్‌కు అరగంట ముందు జాకిర్ అనుకోకుండా తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును సేవించి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. అతన్ని పోలీసులు హుటాహుటిన ఎల్లారెడ్డిపేటలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు.

Comments

comments