Search
Thursday 18 January 2018
  • :
  • :
Latest News

హోటల్ బిల్లు కట్టలేక వ్యక్తి చేసిన రిస్క్ చూస్తే షాక్ అవ్వాల్సిందే…!

Man-stuck

బీజింగ్: చైనాలోని గుయిజ్‌హౌ నగరంలో ఓ వ్యక్తి తాను బస చేసిన హోటల్ బిల్లు ఎగ్గొట్టేందుకు చేసిన సాహసం చూస్తే షాక్ అవ్వాల్సిందే. బస చేసిన హోటల్ బిల్లు కట్టేందుకు తన వద్ద డబ్బులు లేకపోవడంతో ఓ వ్యక్తి చేసెదేమిలేక తప్పించుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా తాను ఉన్న హోటల్ నుంచి దగ్గరలోని మరో బిల్డింగ్‌లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. దీనికోసం ఆ రెండు భవనాలను కలుపుతున్న టెలిఫోన్ వైర్లను ఆసరగా చేసుకున్నాడు. అనంతరం తాను ఉంటున్న 19 అంతస్తుల భవనం కిటికీలో నుంచి ఎదురుగా ఉన్న భవనానికి బయల్దేరాడు. అయితే కొంతదూరం వెళ్లాక కాని మనోడికి అసలు విషయం బోదపడలేదు. మధ్యలో వెళ్లి అటుఇటు కదలేక వైర్ల మధ్యలో ఇరుక్కుపోయాడు. దాంతో పడరాని పాట్లు పడ్డాడు. ఇది గమనించిన కొందరు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని సదరు వ్యక్తిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చింది. దీంతో ఆ వ్యక్తి బతుకుజీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. అనంతరం అతడిని పోలీసుల వద్దకు తీసుకువెళ్లారు. వారు కౌన్సిలింగ్ ఇచ్చి కొద్దిసేపటి తర్వాత వదిలిపెట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Man Stuck Mid Air after Trying to Skip Hotel Bill between Two Buildings in China.

Comments

comments