Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

రేవంత్ మాటలను ప్రజలు నమ్మరు : జూపల్లి

Jupally-Krishna-Rao

హైదరాబాద్ : రేవంత్‌రెడ్డి మాటలను ప్రజలు నమ్మరని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మొదటగా టిఆర్‌ఎస్‌లో చేరి, ఇప్పటి వరకు టిడిపిలో ఉండి , నేడు కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని, ఇటువంటి వ్యక్తులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సుధీర్ఘ ఉద్యమాలు జరిగాయని, వందలాది మంది బలిదానాలు చేశారని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో కాంగ్రెస్, టిడిపి నేతలు కనీసం స్పందించలేదని ధ్వజమెత్తారు. రేవంత్ వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో సైతం టిఆర్‌ఎస్ గెలిచి, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Minister Jupally Comments on Revanth Reddy

Comments

comments