Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

సీజనల్ వ్యాధులతో మంచాలెక్కిన…

Villege-hospitals

మన తెలంగాణ/శ్రీరంగాపురం: మండల పరిధిలోని నాగసానిపల్లిలోని గ్రామస్తులు అధిక సంఖ్యలో సీజనల్ వ్యాధుల బారిన పడి స్థానిక ఆర్‌ఎంపి వైద్యులను ఆశ్ర యించి రూ. 80 వేల నుండి రూ. లక్ష దాకా ఖర్చుచేసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య చికి త్సలు పొందుతున్నారు. స్పందించాల్సిన వైద్యఆరోగ్యశాఖా ఆలస్యంగా కళ్లుతెరచి సోమవారం గ్రామంలోవైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితులకు ప్రధానమైన కారణాలు ముఖ్యంగా గ్రామంలో పారిశుద్ధ్యం, స్వచ్ఛభారత్‌లపై గ్రామస్తులకు సరి యైన అవగాహన కల్పించకపోవడంతో ఈ సీజనల్ వ్యాధుల పడ్డారు.

పంచాయతీ రాజ్,ఆర్‌డబ్లుఎస్‌శాఖలు బాధ్యతలు వహించకపోవడమే కారణం. సిసి రోడ్లు ఉన్న ప్పటికి సరియైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో అంతర్గతరహదారుల వెంట మురు గునీరు ప్రవహిస్తుంది. ఇండ్ల పరిసర ప్రాంతాల్లో మురగుగుంతలు ఏర్పడి దోమలు ప్రధానంగా వృద్ధి చెందుతున్నాయి. ప్రాథమికంగా నివారణ చేయకపోవడంతో గ్రామస్తులు రోగాల బారిన పడ్డారు. వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈఒఆర్‌డి ఖాలిక్ గ్రామంలో యుద్ధ్దప్రాతిపదికన పారిశుద్ధ్యంపై చర్యలు చేపట్టారు. బ్లీచింగ్ పౌడర్ చల్లించి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇంకుడు గుంతలు,వ్యక్తిగత మరుగుదొడ్లపై అవగాహన కల్పించారు. గ్రామంలో 7 మంది హైదరాబాద్ నగరంలో ముగ్గురు చికిత్సపొందుతున్నారు .కర్నూల్ ఆస్పత్రిలో మగ్గు రు, పెబ్బేరులో ఒక్కరు డెంగ్యూ ,టైఫాయిడ్ జ్వరాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరి జీవన విధానం నిరుపేదలైన ఉపాధి కూలీలు. నాగసానిపల్లిలో వైద్యశిబిరం నిర్వహణ…
సోమవారం నిర్వహించిన వైద్యశిబిరంలో ప్రముఖవైద్యులు డా. రాకేష్‌కుమార్‌రెడ్డి , రామస్వామి, ఎఎన్‌ఎంలు ,ఈఒఆర్‌డి ఖాలిక్, సర్పంచ్ సుజాత ఈశ్వరయ్య ,ఉప సర్పంచ్ కుర్మయ్య. అనురాధ , గ్రామస్తులు పాల్గొన్నారు .

ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించాల్సి వస్తుంది..
పారిశుద్ధలోపంతో గ్రామంలో జ్వరాలతో బాధపడుతున్నారు.ప్రవేటు ఆస్పత్రులకి వెళ్లి వేలకు వేలు కర్చు పెట్టి చికిత్స చేయించుకొవాల్సివస్తుంది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని జ్వరాల నుండి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. అనంతమ్మ, నాగసానిపల్లి

వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం…
గ్రామంలో ఇంకుడు గుంతలు,డ్రైనేజీ నిర్మాణాలకు గ్రామస్తులు సహకరిస్తే వెంటనే చర్యలు చేపట్టి పారిశుద్ధాన్ని మెరుగుపరుస్తాం. సుజాత ,ఈశ్వరయ్య సర్పంచ్ నాగసానిపల్లి

Comments

comments