Search
Wednesday 18 October 2017
  • :
  • :
Latest News

నోకియా నుంచి 4జి ఫీచర్ ఫోన్!

Nokia-4G-Feature-Phones

ముంబయి: త్వరలో తక్కువ రేటుకే 4జి ఫీచర్ ఫోన్లను విడుదల చేసేందుకు నోకియా సిద్ధమైంది. నోకియా మాతృసంస్థ హెచ్‌ఎండి గ్లోబల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అజయ్ మెహతా మీడియాతో ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. గ్రామాలతోపాటు, పట్టణాలు, నగరాల్లోనూ జియో 4జి ఫోన్ ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారు. త్వరలోనే తాము కూడా అతి తక్కువ ధరకే 4జి ఫీచర్ ఫోన్‌ను తయారు చేస్తామని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు.

నోకియా నుంచి వచ్చే 4జి ఫీచర్ ఫోన్లు కచ్చితంగా జనాలను ఆకట్టుకుంటాయని అన్నారు. రిలయన్స్ జియో ఉచిత 4జి ఫీచర్ ఫోన్‌ను తీసుకురావడంతో ఇతర సంస్థలుగా తక్కువ రేటుకే 4జి ఫోన్లను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్, మైక్రోమ్యాక్స్‌లు ఈ విషయంలో ముందున్నాయి. రూ.2వేలకే ఎయిర్‌టెల్ 4జి విఒఎల్‌టిఇ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. మైక్రోమ్యాక్స్ భారత్ వన్ పేరిట 4జి ఫీచర్ ఫోన్‌ను తయారు చేస్తోంది.

Nokia may launch a 4G feature phone in India.

Comments

comments