Search
Wednesday 18 October 2017
  • :
  • :
Latest News

అంతర్గతంగా అవరోధాలు

 పరిష్కరించుకోకపోతే పెట్టుబడులు తగ్గుతాయి 

 భారత్‌కు ప్రపంచ బ్యాంక్ హెచ్చరిక 

 వృద్ధి రేటు అంచనా 7 శాతానికి తగ్గింపు

world-Bankవాషింగ్టన్ : ప్రపంచ బ్యాంక్ కూడా భారత్ వృద్ధి రేటు అంచనాను తగ్గించింది. 2017 సంవత్సరానికి జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు అంచనా 7 శాతానికి సవరించింది. డీమానిటైజేషన్(నోట్ల రద్దు), జిఎస్‌టి(వస్తు, సే వల పన్ను) కారణంగా భారత్ వృద్ధి రేటు మందగమన స్థితికి చేరిందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. 2015లో ఇ దే ప్రపంచ బ్యాంక్ భారత్ వృద్ధి రేటును 8.6 శాతంగా పేర్కొన్న విషయం తెలిసిందే. పటిష్ఠంగా ఉన్న దేశీయ వృద్ధిపై అంతర్గత అవరోధాలు ఒత్తిడి తెస్తున్నాయని, ఈ కారణంగా ప్రైవేటు పెట్టుబడులు తగ్గే అవకాశముందని, ఆటంకాలను పరిష్కరించుకోకపోతే ఆర్థిక వృద్ధి పతనమవుతుందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది.
మంగళవారం ఐఎంఎఫ్(అంతర్జాతీయ ద్రవ్య నిధి) భా రత్ వృద్ధి రేటు అంచనాను 6.7 శాతం తగ్గించింది. ఐఎంఎఫ్ నివేదిక వెల్లడించిన మరుసటి రోజే ప్రపంచ బ్యాంక్ కూడా ఇదే కారణాలతో భారత్ వృద్ధి రేటు తగ్గినట్టు పే ర్కొంది. నోట్ల రద్దు, జిఎస్‌టి అమలు వంటి సంస్కరణలే భారత్ వృద్ధి రేటు తగ్గుముఖం పట్టడానికి కారణాలని పేర్కొంది. 2017 తొలి త్రైమాసికం(ఏప్రి ల్ జులై)లో భారత్ వృద్ధి రేటు 5.7శాతానికి అంటే మూడేళ్ల కనిష్ఠ స్థా యికి పడిపోయిన విషయం తెలిసిందే. అదే సమయంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ట్యాగ్‌ను భారత్ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
దేశీయంగా ఇటీవల ప్రభుత్వ గణాంకాలు కూడా జిడిపి అంచనాల్లో కోత విధించాయి. పలు సంస్థల అధ్యయనా లు జిఎస్‌టి, నోట్ల రద్దు వంటివి మందగమనానికి ముఖ్య కారణాలని చెప్పడం ప్రభుత్వానికి మింగుడుపడని విషయమే. 2016 నవంబర్ 9న మోడీ ప్రభుత్వం పెద్ద నోట్ల ను రద్దు చేయడం వల్ల నగదు కొరత పెరగ్గా, ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావం వృద్ధి రేటును కృంగదీసిందని నిపుణులు భావిస్తున్నారు.
కాగా ఐఎంఎఫ్ 201718 ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటును 6.7 శాతానికి తగ్గించింది. ఏప్రిల్ జులైలో ఇదే ఐఎంఎఫ్ భారత్ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని తెలిపింది. అంటే రెండో త్రైమాసికంలో భా రత్ వృద్ధి రేటు అంచనాలో 0.5 శాతం కోత విధించింది. 201819 ఆర్థిక సంవత్సరంలోనూ భారత్ జిడిపి 7.7 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గనుందని అంచనాలో పేర్కొంది. భారత్ వృద్ధి రేటు మందగించడానికి కారణం డీమానిటైజేషన్(నోట్ల రద్దు), జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) అమలేనని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. ఈ సంస్కరణల అమలుతో భారత్ వృద్ధి రేటుపై గణనీయమైన ప్రభా వం పడిందని అక్టోబర్ నివేదికలో సంస్థ వెల్లడించింది. అయితే చైనా మాత్రం 2017లో 6.8 శాతంతో జిడిపి వృ ద్ధి రేటును స్వల్పంగా మెరుగుపర్చుకుంది. అయితే మధ్యకాలికంగా చూస్తే పరోక్ష పన్ను వ్యవస్థలో భారత్ వృద్ధి రేటులో గణనీయమైన మెరుగుదల కనిపించనుందని, దీని వల్ల భారత్‌కు సానుకూలతలు ఉంటాయని ఐఎంఎఫ్ ఆశాభావం వ్యక్తం చేసింది.

Comments

comments