Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

నోట్ల రద్దు గోప్యత సబబే!

 కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమర్థన

Arun-Jaitley

వాషింగ్టన్: పెద్ద నోట్ల రద్దు(డీమానిటైజేషన్) పారదర్శకత విషయంలో ప్రభుత్వం గుప్తను పాటించడాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్థించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాలలో పాల్గొనేందుకు జైట్లీ వారం రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు, వస్తు,సేవల పన్ను వంటి సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేత మార్గంలో పెట్టాయన్నారు. సంస్థాగత సంస్కరణలు, నిర్మాణాత్మక మార్పులు భారత ఆర్థిక వ్యవస్థను బలమైన మార్గంలో పెట్టాయన్నారు. న్యూయార్క్‌లోని ప్రతిష్ఠాత్మక కొలంబియా యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ విషయాలు చెప్పారు. ఒకవేళ పెద్ద నోట్ల రద్దు విషయాన్ని ముందుగానే తెలపి ఉంటే నల్లధనం దాచుకున్న ప్రజలు బంగారం, వజ్రాలు, భూమి కొనుగోళ్లకు పాల్పడి ఉండేవారని అన్నారు. ‘పారదర్శకత అనేది చాలా మంచి పదం. కానీ అదే పారదర్శకత మోసానికి పెద్ద సాధనం అయ్యే అవకాశం కూడా ఉంటుంది’ అని జైట్లీ చెప్పారు. ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు విషయంలో ఎందుకు గుప్తత పాటించారని విద్యార్థులు అడిగిన ప్రశ్నకు ప్రతిస్పందిస్తూ ఆయన ఈ వివరాలు తెలిపారు. పెద్ద నోట్ల రద్దు విజయవంతమైందని, దానిపై ప్రజలలో అశాంతి ఏమి చెలరేగలేదని ఆయన చెప్పారు.
ఆధార్‌కు దన్నయిన సుప్రీంకోర్టు తీర్పు
గుప్తతపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఆధార్‌కు మినహాయింపునిస్తూ దన్నుగా నిలిచిందని అరుణ్ జైట్లీ చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆధార్‌ను ఎలా ప్రభుత్వం నిర్వహించాలని భావిస్తుందో వివరించారు. ఆధార్‌పై సుప్రీంకోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రస్తుత కాలంలో సరైనదేనని జైట్లీ చెప్పారు. ‘ఉదాహరణకు నేను కోటి రూపాయల నగదును ఖర్చు చేసినా ఎవరూ పట్టించుకోరనుకోండి.. మీరు నాకంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని కూడా అడగలేదనుకోండి…ఎందుకంటే అలా చేస్తే అది నా గుప్తతను ఉల్లంఘించినట్లవుతుంది కదా..కనుక ఈ విషయంలో తీర్పు మినహాయింపునివ్వడం సరైనదే అనిపిస్తోంది’ అని జైట్లీ వివరించారు. ఆధార్ చట్టంలో కొన్ని రక్షణ ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు.

Comments

comments