Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

పౌర్ణమి వేళ..

 

Pamu-image

 

మన తెలంగాణ/ ఖమ్మం అర్బన్ : కార్తీక పౌర్ణమి ప్రారంభం రోజున ఓ ఇంట్లోకి నాగుపాము ప్రవేశించింది. ఆ ఇంట్లో వాసులంతా పౌర్ణమి రోజు పాము రావడంఎంతో మంచిదని దానిని చంపకుండా వదిలేశారు. వివరాల్లోకి వెళితే…..మండల పరిధిలోని వి. వెంక టాయపాలెం గ్రామంలో కిలారు వాణి ఇంట్లోకి శుక్రవారంనాగుపాము ప్రవేశించింది. కొంత సేపటితర్వాత నాగుపాము ఇంట్లో పడగ విప్పి ఉండడంతో వాణి చూసి భయపడింది.ఆ తర్వాత చుట్టు పక్కల వారిని పిలిచింది. కార్తీక పౌర్ణమి ప్రారంభం కావడంతోఎంతో మంచిదని దానిని చంపవద్దని చెప్పడంతో కొత్తగూడెం నుంచి వన్యప్రాణిసంరక్షకుడు సంతోష్‌కుమార్‌ను పిలిపించి దానిని పట్టించారు. ఆ నాగుపామును ఓప్లాస్టిక్ డబ్బాలో తీసుకెళ్లారు. ఆ నాగు పామును అడవీలో వదిలనున్నట్లు సంతోష్తెలిపారు. పాము వచ్చిందని తెలుసుకున్న గ్రామస్తులంతా దానిని చూసేందుకువచ్చారు. మహిళలు భక్తితో పూజించారు.

Comments

comments