Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

సైబర్ గాలం

Fake-Message

లాటరీ వచ్చిందంటూ సెల్‌కు మెసేజ్‌లు
ట్యాక్స్ కట్టాలంటూ కుచ్చుటోపీ
మోసపోతున్న సామాన్యులు

మధిర: ఆధునిక సమాజంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రముఖ కంపెనీల పేర్లను అడ్డం పెట్టుకుని ఫోన్ లకు సందేశాలు పంపుతూ మీ నెంబర్‌కు లాటరీ తగిలిదంటూ… మీకు కోటి రూపాయాల వరకు డబ్బులు ఇస్తామంటూ… మీ వివరాలను మెయిల్‌ చేయాలని… తప్పుడు మెసేజ్‌లు పంపిస్తున్నారు కేటుగాళ్లు. ఈ మెసేజ్‌లు చూసి స్పందించిన వారు నిజంగానే తమకు ఏమైనా బహుమతులు వచ్చాయనేమోనని ఆత్రూతలో ఫోన్‌లు చేయటంతో ఫోన్‌లో మీకు కంపెనీ నుంచి లాటరీ తగిలిందని, డబ్బులు పంపటం కోసం ట్యాక్స్ కట్టాల్సి వుంటుందని, ఆ ట్యాక్స్ కట్టడం కోసం తాము చెప్పిన ఎకౌంట్‌లో కొంత సొమ్ము జమ చేయాలని చెబుతున్నారు. మధిర పట్టణంకు చెందిన కొంత మంది వ్యక్తులు డబ్బులు వస్తాయనుకుని వారి చెప్పిన ఎకౌంట్‌లో డబ్బులు జమ చేసి తర్వాత లబోదిబోమంటున్నారు. ఇటువంటి సంఘటనలు మధిర పట్టణంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి.

వివరాలల్లోకి వెళ్లితే… మధిర పట్టణానికి టీ అమ్ముకోవటం కోసం రాజస్థాన్ నుంచి వచ్చిన వ్యక్తికి మెసేజ్ రావటంతో వారి చెప్పిన ఎకౌంట్‌కు రూ.1లక్ష జమ చేయటం జరిగింది. తర్వాత వారి కట్టిన డబ్బులు ట్యాక్స్‌లకు సరిపోవటం లేదని, ఇంకొక లక్షరూపాయలు ఎకౌంట్‌లో వేయాలని తెలుపగా మరోక లక్ష రూపాయలను బ్యాంకులో జమ చేసానని, తర్వాత ఎటువంటి స్పందన లేకుండాపోయిందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. మధిర ముస్లింకాలనీకి చెందిన ఇంకొక వ్యక్తికి ఇటువంటి మెసేజ్ రాగా స్పందించి డబ్బులు బ్యాంకులో వేయటం జరిగింది. అనంతరం వేసిన డబ్బులు సరిపోలేదని, మరల అదే ఎకౌంట్‌లో డబ్బులు వేయాలని తెలపగా ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ బ్యాంక్ ఎకౌంట్‌లో డబ్బులు వేయటం జరిగింది. అనంతరం వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తాము మోసపోయామని గుర్తించారు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాంతో వారు ఏమీ చేయాలో అర్ధం కావటం లేదని వాపోయతున్నారు. కావున ఇప్పటికైనా ప్రజలు తమకు వచ్చిన తప్పడు మెసేజ్‌లను నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి.

Comments

comments