Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

ఒప్పో ఎఫ్5: 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో

Oppo-F5

చైనీస్ మొబైల్ తయారీదారు ఒప్పో ఎఫ్5 పేరుతో గురువారం తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇంతకుముందు ఎఫ్3 హ్యాండ్‌సెట్ల మాదిరిగానే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ కూడా సెల్ఫీలను ఫోకస్ చేసుకుని రూపొందించింది. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బ్యూటీ టెక్నాలజీని ఈ స్మార్ట్‌ఫోన్ కోసం వినియోగించింది. కాగా, భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్ 2న విడులకానుందని సంస్థ అధికారులు తెలిపారు. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. అందులో ఒకటి 4బిజి ర్యామ్, 32జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉండగా, దీని ధర సుమారు రూ.20వేలు. అదేవిధంగా 6జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్ దీని ధరను వెల్లడించలేదు.

ఒప్పో ఎఫ్5 ఫీచర్లు…
ఎఐ-ఎనాబుల్ బ్యూటీ టెక్నాలజీ
20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
6 అంగుళాల టిఎఫ్‌టి డిస్‌ప్లే(ఫుల్-హెచ్‌డి ప్లస్ తాకే తేర)
ఆక్టా-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్
మెమరీ 256జిబి వరకు విస్తరించుకునే అవకాశం
ఆండ్రాయిడ్ 7.1 నోగట్
బ్లూటూత్ 4.2, జిపిఎస్ అండ్ ఒటిజి సపోర్ట్
జి-సెన్సార్, ఇ-కంపాస్
3200 ఎంఎహెచ్ బ్యాటరీ

Oppo F5 with 20-megapixel selfie camera launched.

Comments

comments