Search
Sunday 27 May 2018
  • :
  • :

పవర్‌ఫుల్ ప్యాక్‌గా ‘పద్మావతి’ ట్రైలర్…

Padmavati

బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే, రణ్‌వీర్‌సింగ్, షాహిద్ కపూర్‌ హీరోహీరోయిన్లుగా సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పద్మావతి’ ట్రైలర్ విడుదలైంది. రాణి పద్మినిగా దీపికా, రణ్‌వీర్ అల్లావుద్దీన్ ఖిల్జీగా, షాహిద్ మహారావల్ రతన్ సింగ్‌గా తమతమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఎప్పటిలాగే బన్సాలీ తనదైన శైలిలో రిచ్‌నెస్‌తో ట్రైలర్ ను పవర్‌ఫుల్ ప్యాక్ గా రెడీ చేశాడు.  భారీ పోరాట సన్నివేశాలు, పాత్రధారుల వస్త్రధారణ ప్రత్యే ఆకర్షణ అని చెప్పాలి. మూడు నిమిషాల వ్యవధిగల ఈ ట్రైలర్, మూవీపై అంచనాలను భారీగా పెంచేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ‘పద్మావతి’ మూవీ డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తాజాగా విడుదలైన ‘పద్మావతి’ ట్రైలర్ మీ కోసం…

Comments

comments